కళాకారులకి శుభవార్త…

0
327
good news for artists
good news for artists
    రాష్ట్ర ప్రభుత్వం కళాకారులందరికీ మంచి శుభవార్త అందించింది. పర్యాటక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ రాష్ట్రంలోని కళాకారులందరికీ గుర్తింపు కార్డులు అందజేస్తామని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, నాటకకళాకారుడు కేవీ రమణాచారికి తొలికార్డును అందజేశారు. భాషా సాంస్కృతికశాఖ ద్వారా తొలి గుర్తింపుకార్డు అందుకోవడం సంతోషంగా ఉందని కేవీ రమణాచారి అన్నారు.
    కళాకారుల కోసం తెలంగాణ ఐటీ అసోసియేషన్ ఇంజినీర్లు రూపొందించిన వెబ్‌సైట్‌ను శనివారం అజ్మీరా చందూలాల్ సచివాలయంలోని తన చాంబర్‌లో ప్రారంభించారు. కళాకారులు తమ ఆధార్‌కార్డు,
    ప్రదర్శించే కళారూపం, పాత ఐడీకార్డు, ఫొటో, 10వ తరగతి సర్టిఫికెట్‌ను www.tsdolc.com వెబ్‌సైట్‌లో ఆప్‌లోడ్ చేస్తే ఆ వివరాలను భాషా సాంస్కృతికశాఖ అధికారులు పరిశీలించి అర్హులైన వారికి గుర్తింపుకార్డులు అందజేస్తామని పేర్కొన్నారు. రాష్ర్టానికి చెందిన కళాకారులకు ఏక్‌భారత్, శ్రేష్ఠ్‌భారత్‌లో గుర్తింపు రావడం గర్వకారణంగా ఉందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here