రిజర్వేషన్స్ ని పునః సమీక్షించాల్సిన అవసరం ఉందా?

0
340

ఆదివాసీలు ,లంబాడీల ఘటనతో రిజర్వేషన్స్ మీద చర్చ మళ్ళి ప్రారంభమయింది.లంబాడీలను ST జాబితాలో నుంచి తీసివేయాలనే డిమాండ్ తో ఆదివాసీలు ఉద్యమాన్ని ఉధృతం చేసారు.డిసెంబర్ 9 నాడు తుడుందెబ్బ పేరుతో ఆదివాసీలు హైదరాబాద్ లో బహిరంగ సభ ను నిర్వహించారు.ఆ సభ ద్వారా వారు గట్టి హెచ్చరికలను ప్రభుత్వానికి పంపారు.
హైదరాబాద్ రాష్ట్రం,ఆంధ్ర రాష్ట్రం కలిసి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన 1956 నుంచి 1976 వరకు లంబాడీలు ST జాబితాలో లేరు.1976 లో ఇందిరాగాంధీ ప్రభుత్వం కొన్ని కులాలను ST జాబితాలో చేర్చింది.ఆ సమయములోనే ఆంధ్రప్రదేశ్ లోని లంబాడీలను ST లుగా గుర్తించారు.లంబాడీలు దేశంలోని వివిధ రాష్ట్రాలలో పలు విధాలుగా రిజర్వేషన్స్ ని పొందుతున్నారు.కొన్ని రాష్ట్రాలలో వారు ST జాబితాలో వున్నారు,మరికొన్ని రాష్ట్రాలలో SC జాబితాలో వున్నారు,మరికొన్ని రాష్ట్రాలలో OBC జాబితాలో వున్నారు ,ఇంకా కొన్ని రాష్ట్రాలలో రిజర్వేషన్ లేదు.ఆదివాసీలు ప్రధానముగా ఆరోపించేది ఆ రోజు ST జాబితాలో కలిపినప్పుడు వారి జనాభా 60వేలుగా ఉండేది,కానీ ఈ రోజు లంబాడీల జనాభా 25 లక్షలు చేరింది.మొత్తం రాష్ట్రంలో ఉన్న 35 లక్షలు ST జనాభాలో వారే 25 లక్షలు వున్నారు.దీని వలన ప్రభుత్వ ఉద్యోగాలలో,రాజకీయ పదవులలో,పోడు భూములలో మాకు అన్యాయం జరుగుతుంది అనేది ఆదివాసిల వాదన.
మిగతా రాష్ట్రాల వలె ఇక్కడ కూడా లంబాడీలను ST జాబితా నుంచి తొలగించాలి అనే డిమాండ్ తో ఆదివాసీలు ఉద్యమాన్ని చేస్తున్నారు.
ఆదివాసీల సభకు పోటీగా లంబాడీలు కూడా హైదరాబాద్ లో సభ ను నిర్వహించి గిరిజన,ఆదివాసీలు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.ఈ పోటాపోటీ సభల వలన పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.
అదే విధంగా SC వర్గీకరణ పేరుతో ఎన్నో సంవత్సరాలుగా ఉద్యమం చేస్తున్న మంద కృష్ణ మాదిగను కూడా అరెస్ట్ చేయడముతో తెలంగాణ లో రిజర్వేషన్స్ మీద చర్చ మళ్ళీ ప్రారంభమయింది.
కానీ ఈ విషయములలో అటు కేంద్ర ప్రభుత్వం కానీ ,ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎటువంటి ప్రకటన చేయలేదు.రాజకీయంగా తమ పార్టీలకు నష్టం జరుగుతుంది అనే భావన తో ప్రభుత్వాలు స్పంధించుటలేదు అనే విమర్శలు వినపడుతున్నాయి.
మన రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తంలో రిజర్వేషన్స్ మీద ఉద్యమాలు జరుగుతున్నాయి.గుజరాత్లో పటేళ్లు ,ఆంధ్రలో కాపులు,హర్యానాలో జాట్ లు కూడా ఉద్యమాలు చేస్తున్నారు.ఈ పరిణామాలు చూసినప్పుడు రిజర్వేషన్స్ ని పునః సమీక్షించాల్సిన అవసరం ఉందా? అనే భావన విశ్లేషకుల్లో వినపడుతుంది.కమిటీలు వేసి అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా వుండే విధంగా రిజర్వేషన్స్ ని పునః సమీక్షించాలి అనే డిమాండ్ ప్రజల నుంచి వినపడుతుంది

Rama Krishna Miriyala

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here