దేశంలో నిరుద్యోగ సమస్య రోజు రోజుకి అధికమవుతున్న తరుణంలో మన హైదరబాద్ జీహెచ్ఎంసీ శాఖ నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే ఆలోచనతో ఈ నెల 7వ తేదీన జాబ్ మేళ నిర్వహించడానికి కసరత్తులు చేస్తుంది. హైదరబాద్ లోని సెంట్రల్ జోన్ పరిధి గగన్ మహల్ లోని ఏపి కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కామెర్స్ కాలేజీ లో తేది 07 జులై 2017 శుక్ర వారం రోజున ఉ. 9 గంటల నుండి సా. 5 గంటల వరకు జాబ్ మేళ నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ జాబ్ మేళలో టెన్త్ , ఐటీఐ, ఇంటర్, డిగ్రి, ఎంబిఏ, ఎంసీఏ, డిప్లోమా , బీటెక్ అర్హత కలిగి 18-35 సంవత్సరాల వయస్సు గల నిరుద్యోగులు తమ తమ సంభందిత సర్టిఫికేట్స్ , సీవీ లతో హాజరవ్వాలని అధికారులు సూచించారు.