మూడు గంటల పాటు థ్రిల్లింగ్ చేసే జంట కథల జెంటిల్మన్

0
1943

అష్ట చెమ్మ సినిమా తో కెరీర్ ని స్టార్ట్ చేసి అంచెలంచేలుగా ఎదిగిన హీరో నాని. ఈ మధ్యలో ఎవడే సుబ్రమణ్యం ,భలే భలే మగాడివోయ్ ,కృష్ణ గాడి ప్రేమకథ లాంటి సినిమాలతో ఊపుమీదున్నాడు,అదే అష్ట చెమ్మ సినిమాకు దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ గారి టాలెంట్ కి తగ్గట్టు గా ఎన్నో సినిమాలు వఛ్చిన కూడా కొన్ని సినిమాలు తప్పించి ప్రేక్షకుల మనసుని పెద్దగా దోచుకోలేకపోయాయి. ఒకప్పుడు ఆదిత్య 369 లాం టి గొప్ప చిత్రాలు తీసిన శివలంక ప్రసాద్ గారు కూడా  మధ్యలో ఎన్నో సినిమాలు తీసిన కూడా ఆయన  అభిరుచిని ప్రేక్షకులు పెద్దగా గుర్తించలేదు. ఒకప్పుడు మెగా స్టార్ చిరంజీవి లాంటి హీరోలకు ఆస్థాన సంగీత దర్శకుడిగా ఉన్న మని శర్మ తర్వాత  దేవి శ్రీ ,థమన్ లాంటి వల్ల ఊపుని తట్టుకోలేక కాస్త వెనుకపడి పోయాడు. అలాంటి వల్ల  కాంబినేషన్ లో వఛ్చిన సినిమా జెంటిల్ మాన్ . ఒకప్పటి బ్లాక్ బ్లాస్టర్  పేరు తో వఛ్చిన ఈ సినిమా ఎలా ఉందొ సమీక్షలో చూద్దాం. 

కథ

సినిమా ప్లైట్ లో మొదలవుతుంది. ఇద్దరు హీరోహీన్లు క్యాథరిన్(నివేదా) మరియు ఐశ్వర్య ఇండస్ట్రీస్ ఓనర్. జై కూతురు కూడా ఐశ్వర్య(సురభి) పక్క పక్కనే కూర్చోవటం వలన వాళ్ళ వాళ్ళ ప్రేమ కథలు చెప్పుకుంటారు. అందులో భాగంగా ఐశ్వర్యతన లవ్ స్టోరీ ని చెపుతుంది. జయరామ్ (నాని) చిన్న వయసులోనే యంగ్ ఎంటర్ ప్రెన్యూర్ గా అవార్డ్ అందుకున్న పెద్ద బిజినెస్ మన్, మంచి మనిషిగా కూడా పేరున్న జైని తన ఇంటి అల్లుడు చేసుకోవాలనుకుంటాడు ఐశ్వర్య వాళ్ళ నాన్న. జై కూడా ఐశ్వర్య(సురభి)తో పెళ్లికి ఒప్పుకుంటాడు. కొద్ది రోజుల్లో పెళ్లి అనుకుంటున్న సమయంలో తన ఫ్రెండ్స్‌ని కలవటానికి లండన్ వెళుతుంది ఐశ్వర్య.
ఫ్లైట్ దిగిన ఐశ్వర్యను రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన జయరామ్, అచ్చు తన బాయ్ ఫ్రెండ్ గౌతమ్(నాని) లాగే ఉండటం చూసి షాక్ అవుతుంది క్యాథరిన్. అదే సమయంలో తన బాయ్ ఫ్రెండ్ గౌతమ్ యాక్సిడెంట్లో చనిపోయాడని తెలుస్తుంది. అయితే గౌతమ్ యాక్సిడెంట్లో చనిపోలేదని, ఎవరో చంపారని ఓ రిపోర్టర్(యాంకర్ శ్రీముఖి) ద్వారా తెలుసుకున్న క్యాథరిన్, గౌతమ్ మరణం వెనక మిస్టరీని ఛేదించాలనుకుంటుంది. మరి అనుకున్నట్టుగా క్యాథరిన్, గౌతమ్‌ను చంపింది ఎవరో కనిపెట్టిందా..? అసలు జయరామ్‌కు, గౌతమ్‌కు సంబంధం ఏంటి..? నిజంగా నాని హీరోనా..? విలనా..? అన్నదే మిగతా కథ.
విశ్లేషణ

కథ ని చూస్తే ఒకప్పటి చిరంజీవి సినిమాలు అయినా దొంగమొగుడు ,రౌడీ అల్లుడు సినిమాలు గుర్తుకొస్తాయి .కానీ కథనం మాత్రం పూర్తిగా కొత్త తరహాలో ఇంకాస్త వివరించి చెప్పాలంటే ఆ సినిమాలకు థ్రిల్లింగ్ మసాలా జోడించారని చెప్పొచ్చూ. కథలో జనాలను భాగం చేస్తూ దాదాపు క్లయిమాక్స్ దగ్గరికి వచ్ఛే వరకు ఎం జరుగుతుందో అనే ఫీలింగ్ ని మైంటైన్ చేయటంలో ఇంద్రగంటి 200% సక్సెస్ అయ్యారనే చెప్పాలి . గంట గంటకో ట్విస్ట్ ,ప్రతి క్షణం థ్రిల్ పెంచుతూ కథ ని బాగా హ్యాండిల్ చేసిన ఇంద్రగంటి కి పూర్తిగా క్రెడిట్ ఇవ్వాలేమో. సెకండ్ హాఫ్ లో కొన్ని లాజిక్ లు మిస్ అయినా కూడా తన టేకింగ్ తో బాగా న్యాయం చేసాడు. ప్రధానంగా ఫస్ట్ హాఫ్ లో వచ్ఛే కామెడీ ,పంచ్ మాటలు అదిరిపోయాయి. ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించాలి ,ఒక కాలి చెప్పు విరిగితే మరో చెప్పు విరగొట్టాలి,కోడై కొనాల లో నాలో కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి,హీరోహిన్ ని నాని ఎత్తుకోవాల్సి వఛ్చినపుడు ఈ అమ్మాయికి డైటింగ్ చేసే మూఢ నమ్మకాలు లేవనుకుంటా అనే డైలాగ్‌లు చప్పట్లు కొట్టిస్తాయి. జై కి ఐశ్యర్య కి పెద్దలు పెళ్లి చూపులు పెట్టినపుడు ఒకరికొకరు అర్థం చేసుకొని పెళ్లి చేసుకోవాలని దానికి ప్రీ హానీ మూన్ కి కొడైకెనాల్ కి వెళ్లే కాన్సెప్ట్ ఇంద్రగంటి తీసిన అంతకు ముందు ఆ తర్వాత సినిమా గుర్తొస్తుంది కానీ అక్కడి ఎపిసోడ్ ఫ్రెష్ గా ఉంటుంది.

ఇక ఈ సినిమాలో ఇంద్రగంటి తర్వాత ప్రస్తావించాల్సింది హీరో నాని గురుంచి చించి పడేసాడు. వ్యాపార వేత్త గా ఉంటూ రొమాంటిక్ బాయ్ గా తర్వాత కిల్లర్ పాత్రలో బాగా ఒదిగిపోయాడు. ఇక గౌతమ్ పాత్రలో తనకు నప్పే సహజ నటనతో కామెడీ చేస్తూ ఇరగదీసాడు. ప్రధానంగా సెకండ్ హాఫ్ లో సీరియస్ పాత్రలో ,హీరోహిన్ తో ఎమోషన్స్ సీన్లలో బాగా చేసాడని చెప్పాలి. ఇద్దరు హీరోహీనులు బాగా చేశారు. అష్ట చెమ్మతో పాపులర్ అయి నాని కి సమాంతరంగా ఎదిగిన అవసరాల శ్రీనివాస్ పాత్ర బాగుంది.

కమెడియన్స్ సంగతి కొస్తే ఈ మధ్య సునీల్ లేని లోటు తీరుస్తున్న వెన్నెల కిషోర్ స్ట్రిక్ట్ మేనేజర్ పాత్రలో ఎదిగిపోయాడు.ప్రధానంగా సత్యం రాజేష్ వాడుతున్న కీబోర్డు పైన మ్యాజిక్ స్ప్రే ని వాడటం ,X అనే కీ ని ప్రెస్ చేయాలంటే ప్రతి సారి ఆయన సంతకం తీసుకోవాలనే కాన్సెప్ట్ బాగుంది.

ఇక సంగీతం గురుంచి చెప్పాలంటే మణి శర్మ ఒకవైపు మంచి పాటలనిఛ్చి ,బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమా ప్రెసెంటేషన్ ని ఒక లెవెల్ కి తీసుకెళ్లాడు. పి.జి.విందా ఫొటోగ్రఫీ బాగుంది.

ఇక last but not least నిర్మాత గురుంచి ,నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్. నిజానికి ఈ సినిమా ని నిర్మించాలంటే దైర్యం ఉండాలి. ఎందుకంటే ఒక వైపు థ్రిల్లర్ జానర్ మరోవైపు రొమాంటిక్ టచ్ దానితో పాటు కామెడీ కోణం. దానితో పాటు నాని ఇప్పటి వరకు చేయని పాత్ర. మరో వైపు సృజనాత్మకమైన ,కుటుంబ ప్రేమ కథ చిత్రాలు తీసే ఇంద్రగంటి తో ఒక థ్రిల్లర్ ని తీయటం. సినిమా ప్రెసెంటేషన్ లో ఈ ఒక్కటి కూడా మిస్ అయినా కూడా మిస్ ఫైర్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ పూర్తిగా కథ మీద నమ్మకంతో సినిమా తీయటం ఆయనకే చెల్లింది. ఒకప్పుడు ఆదిత్య 369 లాంటి సినిమా తీసి దైర్యం చేసిన శివలంక గారి శ్రమ ఈ సారి కూడా వృథా కాలేదు.

ప్లస్ పాయింట్స్

 • కథనం
 • నాని నటన 
 • ఇంద్రగంటి దర్శకత్వం ,మాటలు
 • మని శర్మ మ్యూజిక్
 • వెన్నెల కిశోర్ కామెడీ

మైనస్ పాయింట్స్

 • సెకండ్ హాఫ్ లో కొరవడిన కథనంలో వేగం
 • జై చనిపోయే సీన్ లో ప్రేక్షకులు డిస్ కనెక్ట్ అవుతారు.
 • దొంగమొగుడు ,రౌడీ అల్లుడు లాంటి కథ
 • సినిమా మొత్తం హీరోహిన్ నివేదా థామస్ నడిపిస్తుంది వలన నాని స్కోప్ తగ్గినట్టు అనిపించింది
  క్లయిమాక్స్

నటీనటులు: నాని – నివేదా థామస్ – సురభి – అవసరాల శ్రీనివాస్ – ఆనంద్ – తనికెళ్ల భరణి – వెన్నెల కిషోర్ – సత్యం రాజేష్ – రోహిణి – మధునందన్ – ప్రగతి తదితరులు
సంగీతం: మణిశర్మ
ఛాయాగ్రహణం: పి.జి.విందా
కథ: డేవిడ్ నాథన్
నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్
కథా విస్తరణ – స్క్రీన్ ప్లే – మాటలు – దర్శకత్వం: ఇంద్రగంటి మోహనకృష్ణ
3. 25/5
verdict :మూడు గంటల పాటు థ్రిల్లింగ్ చేసే జంట కథల జెంటిల్మన్

 

Reviewed By: Ravinder Ryada and Neeraja Kothinti

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here