వైభవంగా గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ 15 వార్షికోత్సవం

గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ జూన్ 27 వ తేదీన ఉదయం పదకొండు గంటలకు, గేట్స్ 15 యేండ్ల సంబురాలను మరియు తెలంగాణ ఫార్మషన్ డే ను వర్చ్యువల్ లైవ్ ద్వారా నిర్వహించారు, ఈ యొక్క కార్యక్రమాన్ని గేట్స్ ఫేస్బుక్ లైవ్ పేజ్ మరియు ఇతర మీడియా ఛానెళ్ళలో 5000 మందికి పైగా వీక్షించారు. ఈ యొక్క కార్యక్రమాన్ని అధ్యక్షుడు రాహుల్ చిక్యాలా గారు , చైర్మన్ అనితా నెల్లుట్ల గారు , అలాగే గేట్స్ కార్యనిర్వాహక సభ్యులు సలహాదారులు దీపారాధనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు . అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని జార్జియా డిపార్ట్మెంట్ అఫ్ హెల్త్ &సీడీసీ సలహాలను పాటించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

గేట్స్ అడ్వైజర్ డాక్టర్ సతీష్ చేటి గారు, తెలంగాణ మరియు అట్లాంటాలో చేసిన అసాధారణ సేవలకు వ్యవస్థాపక సభ్యుడు రత్నాకర్ రెడ్డి ఎలుగంటి గారికి టిసిఐ / గేట్స్ వ్యవస్థాపకుడు లేట్ జిఎస్ రెడ్డి గారి అవార్డును అందజేశారు మరియు గేట్స్ వైస్ ప్రెసిడెంట్ కిషన్ తాళ్లపల్లి అవార్డు యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ యొక్క అవార్డును ప్రతి సంవత్సరం ఒకరికి అందజేయబడుతుంది. ఈ యొక్క అవార్డును అమెరికాలో ఇక్కడ తెలంగాణ యొక్క కళలు మరియు సంస్కృతిని ప్రోత్సహించే ఆదర్శప్రాయమైన సమాజ సేవ, దాతృత్వ కార్యకలాపాలు కలిగిన వ్యక్తికి ఈ యొక్క అవార్డును అందచేస్తారు .

దీపారాధన తరువాత తెలంగాణ జానపద గాయకుడు&గేట్స్ కోశాదికారి జనార్థన్ పన్నెల గారు తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలకించారు , ఆ తరువాత తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు ఒక్క నిమిషం మౌనం పాటించి, తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించటం జరిగింది, ఈ కార్యక్రమాలు సుమారు మూడు గంటల పాటు నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా జ్యోత్స్నా పాలకుర్తి గారు, మరియు పూజిత నిర్వహించారు. గేట్స్ కోశాధికారి జనార్దన్ పన్నెల గారు సాంస్కృతిక కార్యక్రమాలను రూపొందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సంస్కృతి, భాష, ప్రజలు మరియు తెలంగాణ యొక్క నిజమైన ప్రాముఖ్యతను తెలియజేసే అద్భుతమైన పాటలు మరియు నృత్య ప్రదర్శనలను సిద్ధం చేశారు, ఈ కార్యక్రమాలు అందరి మన్ననలు పొందాయి. ఈ కార్యక్రమానికి సాంస్కృతిక కార్యదర్శి శ్రీనివాస్ పర్సా గారు సహకారాన్నిఅందించారు.

ఈ కార్యక్రమంలో, సాహితి రత్న, ప్రసిద్ధ రచయిత డాక్టర్ జి. లక్ష్మణరావు గారు, ప్రసిద్ధ గీత రచయిత మరియు తెలంగాణ సీఎం కు OSD. దేశపతి శ్రీనివాస్ గారు మరియు ప్రముఖ తెలగు కవి మరియు డైరెక్టర్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్, తెలంగాణ శ్రీ. మామిడి హరికృష్ణ గారు తెలంగాణ సంస్కృతి, సాహిత్యం గురించి మాట్లాడారు. ఇలాంటి కష్టకాలంలో గేట్స్ 15 సంవత్సరాల వేడుకలు మరియు తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని నిర్వహించినందుకు వారు గేట్స్‌ను అభినందించారు, మరియు తెలంగాణీయులు తెలంగాణ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా గుర్తుంచుకోవడానికి ఇది ఒక ఉదాహరణ అన్నారు. ఈ కార్యక్రమంలో ఇరవైకి పైగా వైవిధ్యభరితమైన తెలంగాణ ప్రదర్శనలు చేపట్టారు ఈ కార్యక్రమంలో 100 కు పైగా కాళాకారులు పాల్గొన్నారు.

యుఎస్ఎ నుండి శ్రీస్టి చిల్లా (డెట్రాయిట్), నీలిమ గడ్డమనుగు విద్యార్థులు, బిందు గోపాలం, ఇషిత, యశశ్రీ, అస్రిత అకులా, సుచరిత అకులా, అదితి, అన్వి, సుమీదా అన్నెపు, రన్విత, అదితి సంగం శ్రీనివాస్ దుర్గం, తెలంగాణ నుండి ప్రముఖ జానపద కళాకారులు డాక్టర్ లింగా శ్రీనివాస్ గారి బృందం , అస్తా గంగాదార్ గారి బృందం, విద్యాానంద చారి గారి బృందం, చెనగరపు నాగరాజు, రెలా రే రేలా రవి గారి బృందం దండేపల్లి శ్రీనివాస్ గారి బృందం మరియు స్వర్ణక్క. ఈ యొక్క కార్యక్రమానికి వ్యాఖ్యాతగా జ్యోత్స్నా పాలకూర్తి మరియు పూజిత బైసాని వ్యవహరించారు.

రాహుల్ ఛిక్యాల అధ్యక్షతన, COVID 19 కొరోనా వైరస్ క్లిష్టమైన సంక్షోభ సమయంలో 15000 మందికి, భోజన సదుపాయం, నిత్యావసర వస్తువులు, , శానిటైజర్స్, మాస్క్స్ లను తెలంగాణ జిల్లాలలో వలస కూలీలకు, పోలీస్ సిబ్బందికి, మున్సిపల్ సిబ్బందికి, లారీ డ్రైవర్లకు అందచేశారు, ఈ కార్యక్రమము ఇరవై రెండు రోజులుగా సాగింది. అంతేకాకుండా ఈ సంవత్సరం అట్లాంటా కమ్యూనిటీకి ఏడు వెబినార్స్ ను నిర్వహించారు. గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ రాబోయే రెండు నెలల్లో తెలంగాణ లో మరియు అట్లాంటా నగరంలో మరిన్ని స్వచ్ఛంద సేవ కార్యక్రమాలను నిర్వహించటానికి సన్నద్ధాలు చేస్తున్నారు . ప్రెసిడెంట్ రాహుల్ చిక్యాల గారు కార్యక్రమానికి మద్దతు తెలిపిన పెద్దలకు ఈవెంట్ స్పాన్సర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు, అలాగే కార్యనిర్వహణ సభ్యులకు , అడ్వైసర్లకు , డైరెక్టర్లకు , కమిటీ ఛైర్స్ కి , వాలంటీర్లకు ధన్యవాదాలు తెలిపారు . గేట్స్ చైర్మన్ అనిత నెల్లుట్ల గారు గేట్స్ ఫౌండింగ్ మెంబర్స్కి, ఈవెంటుకి సహాయాన్ని అందించిన పారిశ్రామిక వేత్తలకు, అంతేకాకుండా బతుకమ్మ పండగకి సహకరిస్తున్నా మహిళా మణులందరికి ధన్యవాదములు తెలియ చేసారు.

కోవిడ్ 19 సమయంలో అట్లాంటా కమ్యూనిటీకి కోవిడ్ 19 పై అవగాహన సదస్సులు నిర్వహించారు, వాటిలో ప్రధానంగా, టాక్స్ వెబ్‌నార్, విల్ / ట్రస్ట్, ఇమ్మిగ్రేషన్, యోగ క్లాసులు వీటిని నిర్వహించిన మరిపెల్లి ప్రవీణ్ గౌడ్ కు నవీన్ బత్తినికి కృతజ్ఞతలు తెలియచేసారు. ఫైనాన్షియల్ సెమినార్ని సమన్వయం చేసినందుకు శ్రీధర్ నెలావెల్లికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వీటన్నిటిని నిర్వహించిన స్థానిక అట్లాంటా కమిటి సభ్యులకు శ్రీనివాస్ పర్సా గారు కృతజ్ఞతలు తెలిపారు. బోర్డు అఫ్ డైరెక్టర్ సందీప్ గుండ్ల గారు నీరంతరం పని చేస్తున్న కమిటి చైర్మన్స్కి రమణ గండ్ర , రామ కృష్ణ గండ్ర , శరత్ గండ్ర , నవీన్ ఉజ్జయిని, శివ రామడుగు గారికి, జ్యోత్స్నా పాలకుర్తి గారికి కృతఙ్ఞతలు తెలియచేసారు.

కార్యక్రమము ముగింపు సమయంలో సునీల్ గోటూరు గారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటానికి సహకరించిన గేట్స్ కార్యనిర్వాహక సభ్యులకు, పబ్లిసిటీ లీడ్ గణేష్ కసం గారికి ప్రత్యేక ధన్యవాదములు తెలియ చేసారు. మరియు టీవీ 9 నుండి మీడియా కోఆర్డినేటర్లు శివకుమార్ రామడుగు గారికి ధన్యవాదాలు తెలిపారు. వేరు వేరు చానెల్స్ ద్వారా ఈవెంట్‌ను ప్రత్యక్షంగా కవర్ చేయడానికి సహకరించిన నిరంజన్ పొద్దుటూరి గారికి . ఈ రకమైన వర్చువల్ ఈవెంట్‌ను ఏర్పాటు చేసి విజయవంతంగా నిర్వహించినందుకు బైటెగ్రాఫ్ ఈవెంట్స్ ప్రశాంత్ కొల్లిపరకు గేట్స్ బృందం కృతజ్ఞతలు తెలిపింది. ఈ కార్యక్రమం కోసం డిజిటల్ వీడియో ఫ్రేమ్‌ను చేసినందుకు చిన్నారి GATeS వాలంటీర్ వైనావికి ధన్యవాదాలు తెలియ చేసారు

గేట్స్ కార్యనిర్వాహక సభ్యులు, అడ్వైసర్ బోర్డు ,రాహుల్ చిక్యాలా గారు (అధ్యక్షుడు), అనితా నెల్లుట్ల (చైర్మన్), కిషన్ తాల్లపల్లి (ఉపాధ్యక్షుడు), సునీల్ గోటూర్ (ప్రధాన కార్యదర్శి), జనార్థన్ పన్నెల (కోశాధికారి), శ్రీనివాస్ పర్సా (సాంస్కృతిక కార్యదర్శి), చలపతి వెన్నమనేని(ఈవెంట్ కార్యదర్శి) శ్రీధర్ నెలవెల్లి (డైరెక్టర్), రఘు బండ (డైరెక్టర్), రామచారీ నక్కెర్టీ (డైరెక్టర్), చిత్తారి పబ్బా (డైరెక్టర్), గణేష్ కాసం (డైరెక్టర్), సందీప్ గుండ్లా (డైరెక్టర్), నవీన్ బత్తిని (డైరెక్టర్), రమణ గండ్ర (కమిటీ) చైర్), రామకృష్ణ గండ్ర (కమిటీ చైర్), గండ్ర శరత్ (కమిటీ చైర్), నవీన్ వుజ్జిని(కమిటీ చైర్), శివ రామడుగు (కమిటీ చైర్), జ్యోత్స్నా పాలకుర్తి (కమిటీ చైర్), పూజిత భైసాని (కమిటీ చైర్).

ఈ యొక్క ఈవెంట్ కి స్పాన్సర్స్ చేసిన. ఐటి డివిజన్ కార్పొరేషన్ , డాక్టర్ శ్రీని గంగసాని, డాక్టర్ గోపాల్ రావు (కార్డియాలజిస్ట్), రెడ్డి సిపిఎ, రాపిడ్ ఐటి, ఇన్ఫో స్మార్ట్ టెక్నాలజీస్ , ఇఐఎస్ టెక్నాలజీస్, ఎస్ఎస్ లెండింగ్, సాఫ్ట్ పాత్ సిస్టమ్స్, పారామౌంట్ సాఫ్ట్వేర్, సువిధా, పటేల్ బ్రదర్స్, డాక్టర్ వెంకట్ వీరనేని, ఎహెచ్‌పి రియల్ ఎస్టేట్ వెంచర్స్, డాక్టర్ సతీష్ చీటీ, విఠల్ కుసుమ (గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్), రవీందర్ మంచిరెడ్డి (కంప్యూనెట్ సర్వీసెస్, ఇంక్), జీవిత్ కనుకుంత (కార్డియాలజిస్ట్), రాజేందర్ రెడ్డి లంకాల(శిశువైద్యుడు), రాహుల్ చికియాల, కిషన్ తల్లాపల్లి, తిరుమల్ పిట్ట, శ్రీధర్ రావు జులపల్లి, ఛాంపియన్స్ ట్యూటరింగ్.

Janardhan Pannela

Show More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close