రేవంత్ రెడ్డికి చుక్కలు చూయిస్తున్న కొడంగల్ యువనేత

0
640

తెలంగాణ ఏర్పడ్డాక తొలి సీఎం కెసిఆర్ గారికి దాదాపు రెండేళ్ల దాకా ప్రతిపక్షం లేనట్టే కనిపించింది కాని ఏ ముహూర్తంలో రేవంత్ రెడ్డి వోట్ కి నోట్ కేసులో దొరికాడో కాని అప్పటి నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన పూర్తిగా విరుచుకుపడటం మొదలుపెట్టాడు. రేవంత్ చూపిన తెగువ చూసి ఎపి సీఎం చంద్రబాబు సమయం దొరికినప్పుడల్లా కెసిఆర్ మీద రేవంత్ అనే అస్త్రాన్ని ప్రయోగిస్తూనే ఉన్నాడు. ఇది చూసిన కాంగ్రెస్ ,బీజేపీలు కూడా ప్రభుత్వం పైన విమర్శలు చేయటం మొదలు పెట్టారు. దాదాపు కెసిఆర్ కి ఛాలెంజ్ చేసేంత వరకు వెళ్ళాడు. ఒక దశలో భావి సీఎం రేవంత్ రెడ్డి అనేవిదంగా అందరు అనుకునే విదంగా ప్రతి పక్షాలు ప్రమోట్ చేశాయి. కాంగ్రెస్ లో సీఎం అభ్యర్థి ,బిజెపి సీఎం అభ్యర్థి అని రేవంత్ ఇమేజ్ ని మీడియా ,సోషల్ మీడియా హైప్ చేయగలిగాయి. కాని అయన స్వంత నియోజకవర్గానికి చెందిన ఒక యువ నాయకుడు మాత్రం రేవంత్ రెడ్డి కొడంగల్ ని పూర్తిగా విస్మరిస్తున్నాడని చెబుతున్నారు. ఏకంగా రేవంత్ రెడ్డి హటావో ... కొడంగల్ బచావో అనే నినాదంతో రేవంత్ రెడ్డి చేస్తున్న తప్పిదాలను ఏకిపారేస్తున్నారు .

అసలు విషయానికొస్తే కొడంగల్ నియోజకవర్గానికి చెందిన గందె మోహన్ అనే యువకుడు రాష్ట్ర కేటీఆర్ యువసేన నాయకులుగా పనిచేస్తూన్నారు. నియోజకవర్గంలో ఏ సమస్య అయినా కూడా ప్రభుత్వానికి చేరవేయడంలో చురుకుగా పనిచేస్తున్నారు. ఐతే ఇటీవల కొడంగల్ మండల పరిధిలో చిత్తపల్లి గ్రామంలో ఉన్న తాగు నీటి సమస్య ను వెలుగులోకి తెచ్చాడు. కాబినెట్ మంత్రులైన కేటీఆర్ ,హరీష్ రావు ,ఎంపీ జితేందర్ రెడ్డిలు వారానికి రెండు రోజులు నియోజకవర్గంలో ప్రజల సమస్యలకు కేటాయిస్తే, రేవంత్ రెడ్డి మాత్రం పూర్తిగా కొడంగల్ ని మర్చిపోయాడని అన్నాడు. రోడ్లు అస్తవ్యస్తంగా మారాయని ,నియోజకవర్గంలో బస్సు డిపో లేదని ,డిగ్రీ కాలేజీ లేదని ,ఒక్క రైల్వే లైన్ లేదని విమర్శించాడు.

యువకుడిని కొడంగల్ ప్రజలు ఓటేస్తే చదువుకున్న వాళ్లకు ఉద్యోగ కల్పనలో పూర్తిగా విఫలమయ్యాడని విమర్శించాడు. కొడంగల్ ని కుప్పంలా మారుస్తాడని చెప్పిన రేవంత్ చివరికి చెత్తకుప్పలా మార్చాడని చెప్పాడు. మరి ఈ విమర్శలకు రేవంత్ రెడ్డి స్పందన ఏంటో చూడాలి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here