కేసీయార్ ప్రోత్సాహం ఇప్పుడు ఫలితాన్ని ఇచ్చింది

0
1483

తెలంగాణ సి.ఎం కేసీయార్ గారు మొదటి నుంచి తెలంగాణ సంస్కృతిని ,కళలను ,క్రీడాకారులను ఎంకరేజ్ చేస్తూనే ఉన్నాడు .ప్రధానంగా బతుకమ్మ ,బోనాలు ,దసరా పండుగలను చాలా భారీగా చేసి వాటికి యూనివర్సల్ గుర్తింపు తెచ్చాడు. సానియా ని తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ చేసి న్యూట్రల్ గేర్ లో ఉన్న ఆమె స్పోర్ట్స్ కెరీర్ కి టాప్ గేర్ వేసాడు. గత ఏడాది తెలంగాణ మహారాణి రుద్రమదేవి సినిమా విడుదల సమయంలో నిర్మాత ,దర్శకులు తెలంగాణాయేతరులు అయినా కూడా సినిమాకు పన్ను ని మినహాయించి నిర్మాతని ఆర్థిక ఇబ్బందుల నుంచి కాపాడాడు. దానికి దగ్గట్టు గానే సినిమా విజయం సాధించింది.

అయితే అపుడు చేసిన ప్రోత్సాహం ,ఇపుడిదే ఫలితాన్ని ఇచ్చింది. నిన్న జరిగిన ఫిలింఫేర్ అవార్డుల్లో ఉత్తమ నటి అవార్డు ని అనుష్క కి రాగా ,బెస్ట్ సపోర్టింగ్ నటుడి అవార్డు తెలంగాణ యోధుడు గోన గంగా రెడ్డి పాత్ర ధరించిన అల్లు అర్జున్ కి వచ్చింది. నిజానికి ఆ ప్పటి వరకు తెలంగాణ యాస అనేది కేవలం కామెడీకే పరిమితం అయినా దరిమిలా మొదటిసారి ఒక హీరోహీజం ని ఎలివేట్ చేసింది ఆ పాత్ర. కాబట్టి కేసీయార్ నిర్ణయం కరెక్ట్ అన్న మాట

 

Author: Rajanna Kothinti

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here