ఉచిత మెగా వైద్య శిబిరం గ్రాండ్ సక్సెస్…

0
311
free mega medical camp grand success.
free mega medical camp grand success.
    ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజల కు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని రాజ్యసభ సభ్యుడు, ధర్మపురి ట్రస్ట్ చైర్మన్ డి.శ్రీనివాస్ తెలిపారు. ఈ మెగా హెల్త్ క్యాంపును నగరంలోని ప్రగతినగర్ మున్నూరు కాపు సంఘం లో ఆదివారం ధర్మపురి ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ ప్రారంభం చేసారు. ఈ సందర్భంగా డి.శ్రీనివాస్ మాట్లాడుతూ పేద ప్రజలకి ఉచితంగా చికిత్స అందించాలని మారుమూల గ్రామాల ప్రజలకు కూడా కార్పోరెట్ చికిత్స అందజేయాలన్న ఆలోచనతో ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని, అందుకు సహకరించిన బంజారహిల్స్ కేర్ దవాఖాన యాజమాన్యానికి, వైద్యులు, వైద్యసిబ్బంది, ఇతర స్వచ్ఛంద సంస్థలు, మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
    పేద ప్రజల సంక్షేమం కోసం డి.శ్రీనివాస్ తనయుడు నిజామాబాద్ తొలి మేయర్ చేసిన కృషి అంతో ఇంతో కాదు.ఉచిత వైద్య శిభిరం నిర్వహించి పేద ప్రజలకు ఉచితంగా కార్పోరేట్ వైద్య సేవలను అందించారు. అలానే నిజమాబాద్ జిల్లా లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి పేద ప్రజల అభివృద్దికి కృషి చేస్తున్నాడు. ఈ సందర్భంగా డి.సంజయ్ మాట్లాడుతూ గుండె, జనరల్ మెడిసిన్ , ఛాతి ,గైనిక్, దంత, కంటి తదితర అన్ని విభాగాల వైద్యులతో శిబిరాన్ని ఏర్పాటు చేసామని అంతేకాకుండా ఉచితంగా వైద్యపరీక్షలు, మందులు పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. మెగా హెల్త్ క్యాంప్‌నకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ప రీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here