జియో 4G ఫోన్ ఉచితంగా…

0
279
free jio phone
free jio phone
    టెలికాం రంగం లో సంచలనం సృష్టిస్తున్న రిలయన్స్ జియో మరో అద్బుతమైన ఆఫర్ తో మార్కెట్ లోకి ప్రవేశించనుంది. అత్యంత చౌక ధరలో జియో 4G ఫోన్ లాంఛ్ చేసింది. మేడిన్ ఇండియా నినాదంతో ముఖేష్ అంబానీ అందరికీ అందుబాటులో ఉండేలా అత్యంత చౌక ధరలో జియో 4G ఫోన్ తీసుకొచ్చినట్లు ప్రకటించారు. ఈ జియో ఫోన్ ఉచితంగా ఇస్తున్నారు. కాని ముందుగా రూ.1,500 డిపాజిట్ చేయాలి. మూడేళ్ల తర్వాత ఈ రూ.1500 తిరిగి ఇస్తారు. భారతీయులకు మాత్రమే ఇది ప్రత్యేకంగా అభివర్ణించారు అంబానీ. ప్రస్తుతం జియో కస్టమర్లుగా ఉన్న వాళ్లందరికీ ఈ ఫోన్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
    ఆగస్ట్ 15వ తేదీన ఈ జియో 4G ఫోన్ విడుదల అవుతుంది. ఆగస్ట్ 24వ తేదీ నుంచి బుకింగ్స్ స్టార్ట్ అవుతాయని, సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ఓపెన్ మార్కెట్ లోకి వస్తాయని ప్రతి వారం 50లక్షల ఫోన్లు విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here