గ్రామస్తులకు హెల్మెట్ గా మారినా ఒక యువకుడి ఆలోచన

0
2905

ఈ యాంత్రికమైన జీవితంలో మన పనులు చేసుకోవటనికే సమయం సరిపోదు ,ఒక సమయమున్నా కూడా సేపరాట్ వ్యాపారం అంటూ పార్ట్ టైం ఉద్యోగాలు చేసే రోజులివి. అలాంటిది తమ గ్రామంలో ఒక సమస్య వస్తే తనకున్న సృజనాత్మకత తో ఒక కార్యక్రమాన్ని చేపట్టి ,ఉచితంగా సమాజ సేవ చేస్తున్నాడు నిజామబాద్ జిల్లాలో కమ్మర్ పల్లి మండల్ లో బషీరాబాద్ గ్రామానికి చెందినా నగేష్ బాశెట్టి అనే యువకుడు. అయన తలపెట్టిన కార్యక్రమం ఏంటి?దానికి వెనుకున్న గల కారణం ఏంటి ?కార్యక్రమం ఫలితాలు ఏంటో ఒక్కసారి చూద్దాం .

తన గ్రామంలో జరిగిన వివిధ రోడ్ ప్రమాదాలలో ముగ్గురు టీనేజ్ యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. దానికి గల కారణం హెల్మెట్ దరించకపోవటమే .ఒకవెల హెల్మెట్ తో ప్రయాణిస్తే తలకు గాయాలు కాకుండా వాళ్ళు బ్రతికేవారు. ఈ ప్రమాదాలతో ఎప్పుడు గంబిర్యంగా ,అందరికి ఆదర్శంగా నిలిచే గ్రామం ,ఒక్కసారి శోకసముద్రంలోకి వెళ్ళిపోయింది . ఆ షాక్ నుంచి తేరుకోవటానికి చాలా సమయం పట్టింది ఎందుకంటే ముగ్గురు ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువకులు అన్ని తెలిసినా హెల్మెట్ పైన ఉన్న పరిజ్ఞానం లేకపోవటంతో ఈ ప్రమాదానికి దారి తీసింది . ఐతే అప్పటికే 10 ఏళ్లుగా గల్ఫ్ లో మంచి ఉద్యోగం చేస్తున్న ఒక యువకుడు మాత్రం ఈ పరిణామన్ని చాల సీరియస్ గా తీసుకున్నాడు. గ్రామా ప్రజలు ఈ సంఘటన ని మర్చిపోయినా కూడా అయన మాత్రం లోలోపల మదన పడుతూనే ఉన్నాడు. ఆ క్రమంలోనే తన కుటుంబ పనుల మీద స్వగ్రామానికి వచ్చిన ఆ యువకుడు ఒక విన్నుతన కార్యక్రమానికి అంకురం చుట్టాడు.ఇక నుంచి తన ఊరిలో ప్రతి ఒకరు హెల్మెట్ పెట్టుకోవలనదే అయన ఉద్దేశ్యం . ఆయనే నగేష్ భాశెట్టి . దానికి ఉచిత హెల్మెట్ ప్రోగ్రాం స్టార్ట్ చేసాడు. దానిలో భాగంగా కొన్ని హేలేట్లను కొని ,చౌరస్తాలో ఒక కిరణా షాప్ లో పెట్టి ,ఎవరికైనా వేరే ప్రదేశాలకు వెళ్ళాలనుకుంటే తమ వివరాలను షాప్ లో నమోదు చేసుకొని హెల్మెట్ తీసుకుపోవచ్చు. మళ్ళి తిరిగివచ్చాక రిటర్న్ ఇవ్వాలి. మరో విశేషం ఏంటంటే బైక్ ఇద్దరు వెళితే ఇద్దరికీ హెల్మెట్ ఇస్తారు. ఒకవేళ వెనుక మహిళలు కూర్చుంటే మహిళలకు సంబందించిన హెల్మెట్ ఇస్తారు . గత ఏడాది పోలీస్ డిపార్టుమెంటు ప్రారంబించిన ఈ కార్యక్రమం ఒక ఉద్యమం లాగా సాగుతూ వస్తుంది . నిజానికి పోలీస్ డిపార్టుమెంటు వాళ్ళకు చాలా స్పూర్తినిచ్చింది. జిల్లా మొత్తం సంచలనంగా మారింది . ఏడాదిలో 1500 ల మంది గ్రామా ప్రజలు హేల్మేట్లను ఉపయోగించారు.ఇప్పటి వరకు గ్రామంలో చాలా అవేర్నేస్స్ వచ్చిందని ,ఎలాంటి అవాంచనీయ ప్రమాదాలు జరగలేదని ,మిగతా గ్రామాలకు కూడా స్పూర్తిన్చిందని నగేష్ అంటున్నాడు .
నగేష్ బాశెట్టి , ఒక మధ్యతరగతికి చెందిన విద్యావంతుడు . స్వతహాగా క్రీడాకారుడు అయిన నగేష్ డిగ్రీ పూర్తీ చేసాడు. మొదటి నుంచి గ్రామంలో జరిగే ప్రతి పనికి స్వచ్చందంగా సేవలు అందించాడు. రామన్ మెగసెసె అవార్డీ శ్రీ పాండురంగ శాస్త్రి అథవలె స్తాపించిన స్వాద్యాయ పరివారంలో భాగమై తాత్వికంగా తను బలపడటమే కాకుండా సమాజంలో తాత్విక చింతనకు తన వంతు పాత్ర పోషించాడు. ఐతే కుటుంబ పోషణ కోసం 10 ఏళ్ల క్రీతం గల్ఫ్ వెళ్ళిన నగేష్ కి ఒక కొడుకు ,కూతురు . గల్ఫ్ లో ఉండగా అక్కడ ఉన్న మన వాళ్ళకు శారీరక ,మానసిక ద్రుడత్వం కోసం ఒక క్రికెట్ జట్టుని స్తాపించి ఖాళి సమయంలో ,శుక్రవారాల్లో క్రికెట్ పోటీలను నిర్వహిస్తూ ప్రవాస భారతీయల మనస్సుని చెడు అలవాట్లకు దూరం చేస్తూ సంచలనం సృష్టించాడు. తన పిల్లల చదువుల కోసం మంచి ఉద్యోగాన్ని వదులుకొని ఇండియా కి వచ్చిన నగేష్ ,రాగానే హెల్మెట్ల కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. అంతే కాకుండా వాళ్ళ గ్రామస్తులు స్వశక్తితో క్రికెట్ ఆడటానికి 15 లక్షల వ్యయంతో నిర్మించిన ఒక మినీ స్టేడియం నిర్మాణానికి తన వంతు సహకారం అందించాడు. ప్రస్తుతం క్రికెట్ అసోసియేషన్ అఫ్ తెలంగాణా (CAT) ,ఆర్మూర్ రెవిన్యూ డివిజన్ కి ఒక సమన్వయకర్త గా వ్యవహరిస్తున్నాడు.

నగేష్ స్వతాహాగా గీత రచియిత కావటం వలన శుక్రవారం దేవి అమ్మ వారి పాటలు రాసాడు ,వాటిని ఒక ఆల్బమ్ గా చేసాడు . ఇపుడు బీంగాల్ లోని లింబాద్రి నరసింహ స్వామి మీద కూడా ఒక ఆల్బమ్ ప్లాన్ చేస్తున్నడు. అంటే కాకుండా బషీరాబాద్ యువకులు హెల్మెట్ అవేర్నేస్స్ మీదా ఒక షార్ట్ ఫిలిం చేస్తే నగేష్ దానికి వాయిస్ ఓవర్ ఇచ్చాడు.

స్వార్ధం తో నిండిన సమాజానికి గ్రామానికి ఒక్కరైన నగేష్ లాగా ఉంటే చాలు గాంధీజీ కలలు కన్న గ్రామా స్వరాజ్యం ఏర్పడటానికి ఎంతో కాలం పట్టదు .

53e85240-e7f0-404c-8108-2725cf74493e

9e558b43-3981-4a1a-80a3-2c3af9e5561a

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here