తూకంలో మోసం?నాణ్యత శూన్యం ..!

0
85

ఇవే సన్నరకం బియ్యం …నేడు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సన్నరకం బియ్యం రకరకాల బ్రాండ్ల పేర్లతో మార్కట్లోకి వ్యాపారస్తులు తెచ్చి విచ్చలవిడిగా అమ్ముకుంటూ వినియోగదారుల ఆరోగ్యాలతో ఆటలాడుకుంటూ జేబులకు చిల్లు పొడుస్తున్నారు సోనా మసూరి ,సాంబ మసూరి ,బిపిటి ,వంటి సన్నరకం బియ్యాన్ని కర్నూలు ,బెల్ ,సాయితేజ ,టమోటో ,హెచ్ ఎమ్ టి ,అన్నపూర్ణ ,మొదలైన బ్రాండ్ల పేర్లతో సన్న రకం బియ్యాన్ని వ్యాపారస్తులు విక్రయాలు మార్కట్లో యథేచ్ఛగా జరుపుతున్నారని వినియోగ దారులు ఆరోపిస్తున్నారు ఈ బ్రాండ్ల పేర్లతో ఉన్న బియ్యం 25 కేజీల బస్తా తూకంలో ఒకొక్క వ్యాపారి ఒక్కో రకంగా తూకం పెట్టించుకుని మిల్లర్ ,బ్రోకర్ల ద్వారా రిటైల్ వ్యాపారులు మోసాలకు ఒడిగడుతున్నారని సమాచారం ఉంది ,కొందరు వ్యాపారులు 25 కేజీలకు బదులు 23 న్నర్ర ,మరికొందరు 24 న్నర్ర కేజీలకు పరిమితం చేసుకొని బ్యాగ్ రేట్ లేకుండా అమ్మకాలు చేయగా ?ఇందులో తూకం ఇంకా ఏమైనా తక్కువ ఉంటే బియ్యం వేడిమీద ప్యాకింగు చేస్తే తక్కువ ఐనట్టుందని ఎవ్వరైనా వినియోగ దారుడు తూకం వేయించుకుంటే వ్యాపారులనుంచి వచ్చే సమాధానం ,ఈ మోసం వ్యాపారం కప్పిపుచ్చుకునేందుకై సదరు కొనుగోలు దారునికి తూకం తక్కువ బియ్యాన్ని ఇవ్వడం వ్యాపారులకు పరిపాటైందట !ట్రేడింగ్ చట్టం ప్రకారం బ్రాండ్ల పేరు రిజిస్టర్ చేయాలి .ఆ బ్యాగులపై తయారీదారుని పూర్తి చిరునామా ,కాంటాక్ట్ నెంబర్లు ,నెట్ తూకం ,ఎమ్మార్పీ స్పష్టంగా ముద్రించాలి ఆలా జరగడంలేదు అని వినియోగదారులు ఆరోపిస్తున్నారు ఇక్కడ ఉదాహరణగా కర్నూలు బియ్యం బస్తాను ఫొటోలో గమనిద్దాం !ఎమ్మార్పీ కాలం వద్ద రూ ,1800 అని ముద్రించారు ,డేట్ అఫ్ ప్యాక్ వద్దా 2019- 2020 అని బ్యాచ్ నెంబర్ కాలి ,ఈ బియ్యం తయారీ కానుంచి 24 మాసాలలో వాడుకోవాలి అని !..ముద్రించారు ,ఎవ్వరు తయారు దారులు ,వారి చిరునామా దైవ దినమ్ ఎంత విచిత్రమో చూడండి ఇన్ని రకాల తప్పిదాలు ఉన్న తూనికలు కొలతల శాఖ ,ప్రజా ఆరోగ్య శాఖ ,పౌర సరఫరాల శాఖలు నిఘా చర్యలు ఎందుకు లోపించి నట్టు బీపీటీ బియ్యంలో సన్నరకం ఇతర వంగడాల బియ్యాన్ని మిక్సింగ్ చేసి మోసాలకు పాల్పడుతున్నట్లు వినియోగదారులు ఆరోపిస్తున్నారు ఇలాంటి రకం బియ్యాన్ని పట్టుకెళ్లి వండుకొని చూస్తే తేడా కనిపించడంతో వాపసు చేసి తిరిగి వేరే బియ్యం వ్యప్రయాసలకు గురై తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి అని వినియోగదారులు బాహాటంగా చేప్పట్టమ్ గమనార్హం గతంలో అంటే 100 కేజీల గోనె సంచి బియ్యానికి కాలి సంచి వ్యాపారికి ఇస్తే నెట్ 100 కేజీల బియ్యం బారాబర్ ఉండేది లేకుంటే బస్తా తూకం  ఖరీదు కలిపి 99 కేజీల బియ్యాన్ని వినియోగదారులు పొందేవారట !ఆ గోనె సంచి మీద ఇంకుతో మసూరి ,హంస ,గొట్టెలు ,ఇలా ధాన్యం రకం పేరులు రాసేవారట ఇప్పుడు ఏకంగా వ్యాపారులు ఆరుగాలం పంటలు పండించి ఉత్పత్తి తమది అన్నటుగా అధీకృత డీలర్ల మాదిరిగా బియ్యం రకరకాల బ్రాండ్ల పేరుతో మోసాలకు పాల్పడుతూ జవాబు దారితనం నుంచి బయట పడుతున్నారు  బియ్యం కల్తీ ,తూకం మోసాలపై పాలకులు నిఘా పెట్టి వినియోగదారులకు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది      

ప్రజా శ్రేయసులో …..
నేను సైతం మీసకినాల సుధాకర్ సీనియర్ జర్నలిస్టు నల్గొండ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here