మన రాజకీయ నాయకులు ఈమె దగ్గర చాలా నేర్చుకోవాలి

0
568
first baby to be breastfed in the federal parliament
first baby to be breastfed in the federal parliament

ప్రజా ధనంతో ప్రజల కోసమని పదవులు పొంది స్వార్ధ రాజకీయాలు చేసే ఈ రోజులో ఒక ఆస్ట్రేలియా ఎంపీ తన మాతృత్వాన్నికి, ప్రజలకిచ్చిన వాగ్దానాన్ని ఒకే సారి చూపించింది. ఆస్ట్రేలియా పార్లమెంటు చరిత్రలో ఈ రోజు ఒక కొత్త అనుభవాన్ని పొందింది. ఆస్ట్రేలియా పార్లమెంటు లో ఒక చిన్నారి పాపాయి అడుగుపెట్టింది. అలా అని ఏ ఎలక్షన్ లో పోటీ చేసి పార్లమెంట్ కి రాలేదు. తన తల్లి ఒడిలో సేదతీరుతూ పార్లమెంట్ లో అడుగు పెట్టింది. ఆస్ట్రేలియా ఎంపీ లారిసా వాట‌ర్స్ తన పసి పాపతో పార్లమెంట్ సమావేశాలకి హజరయ్యారు. అంతే కాకుండా తన పాపకి పాలు కూడ పట్టీంచడంతో పార్లమెంట్ లో ఉన్న మిగతా ఎం.పీ లు విస్తూరపోయారు. ఆస్ట్రేలియా పార్ల‌మెంట్‌ విడుదల చేసిన ఫ్యామిలీ ఫ్రెండ్లీ జీవోను వినియోగించుకున్న తొలి ఎంపీగా నిలిచింది. అటూ మాతృత్వాన్నికి అలాగే తనని నమ్మి గెలిపించిన ప్రజలకు ఒకే సారి న్యాయం చేసి గొప్ప నాయకురాలిగా పేరు తెచ్చుకుంది. లక్షల్లో జీతాలు తీసుకొన్ని ప్రజా సేవ కన్న వారి స్వార్దానికి పదవులు ఉపయోగించుకొనే మన నాయకులు లారిసా వాట‌ర్స్ ని చూసి చాలా నేర్చుకోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here