వార్తల్లోకెక్కని కూకట్ పల్లి ఫోరంమాల్ అగ్నిప్రమాదం

0
3791

అది కూకట్పల్లి సుజనా ఫోరమ్ మాల్,జనవరి 7,2017,అర్థరాత్రి 10:55 సమయం. ఒక థియేటర్లో సినిమా మొదలైంది.అప్పటికే కొన్ని స్క్రీన్ లలో షోస్ మొదలయ్యాయి.ఇంటర్వల్ అయిపొయింది. సుమారు ఒంటి గంట సమయంలో థియేటర్లో పొగలు వచ్చాయి. సినిమా చూస్తున్న జనాలు ఒక్కసారిగా హడావిడిగా భయబ్రాంతులకు గురయ్యారు. ఎం జరుగుతుందో తెలియని పరిస్థితి. చిన్న పిల్లలు నిద్రపోతున్నారు. కొందరు వృద్దులు ఉన్నారు. మహిళలు సంగతి సరే సరి. అందరు ఫైర్ ఎగ్జిట్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ కి వచ్చి వారి స్థలాలను ఖాళీ చేశారు. కానీ అప్పటికి ఫైర్ లారం మోగినట్టు ఎక్కడ అనిపించలేదు,ఎమర్జెన్సీ టీం మెంబర్ల జాడ లేదు. సెక్యూరిటీ వాళ్ళు వచ్చి గైడ్ చేస్తున్నారు. కానీ వాళ్లకు అంతగా ఫైర్ సేఫ్టీ పరిజ్ఞానం ఉన్నట్లు అనిపించలేదు. జనాలు కిందకు దిగటానికి 20 నిముషాలు పట్టింది. అప్పుడే ఫైర్ ఇంజిన్ వచ్చింది. కానీ వాళ్లకు మంటలు ఆర్పటానికి దారి కనపడలేదు. చిట్టా చివరకి వాళ్లకు దారి దొరికింది. మంటలు ఆర్పేశారు.

ఈ విషయాన్నీ సినిమా చూస్తున్న ఒక ప్రేక్షకుడు 2 రోజుల తర్వాత కబుర్లు టీంని ఆశ్రహిస్తే మా టీం అక్కడికి వెళ్లి పరిస్థితులను సమీక్షించింది. కబుర్లు టీం మాల్ కి వెళ్లి అక్కడున్న సిబ్బందితో మాట్లాడాలని ప్రయత్నించారు. వాళ్ళు కొందరు ఏం జరగనట్లు వ్యవహరించారు.కొంచెం గట్టిగా అడిగితె మాత్రం US పోలో షోరూంలో చిన్న షార్ట్ సర్క్యూట్ జరిగిందని పైదాకా మంటలు రాలేవని చెప్పుకొచ్చారు. కాని సినిమా చూసిన ప్రేక్షకుల కథనం వేరుగా ఉంది. 2 రోజుల తర్వాత వెళ్లిన మా టీం US పోలో షోరూంలోకి వెళితే షాప్ ని రిపేర్ చేస్తున్నారు. దాంట్లో కాలిపోయిన వాసనా బీభత్సంగా ఉంది.

ఐతే గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న US పోలో షోరూం నుంచి మొదలయినా 4 వ ఫ్లోర్ లో ఉన్న థియేటర్ లో వరకు పైకి మంటలు వచ్చాయంటే ఎంత తీవ్రంగా ఉన్నాయో తెలుస్తుంది.కాని ఫోరమ్ టీమ్ మాత్రం దీనికి విభిన్నంగా ప్రవర్తించారు. మరో విషయం ఏంటంటే ఇంత పెద్ద సంఘటన జరిగినా కూడా ఒక్క టైమ్స్ అఫ్ ఇండియా పేపర్లో తప్ప ఏ దినపత్రికలో కూడా ఒక చిన్న వార్త రాకపోవటం గమనార్హం. ఇదే విషయాన్నీ నగరంలోని ఒక ప్రముఖ ఫైర్ సేఫ్టీ NGO తో మాట్లాడినపుడు వాళ్ళు కూడా ఫోరమ్ మాల్ ని చాలా సార్లు వీక్షించి అగ్నిప్రమాద రక్షక ముందు జాగ్రత్తలు ఉన్నాయా లేదా అని చూశామని అవి 50% కూడా లేవని ,అక్కడున్న సిబ్బందికి సరైన శిక్షణ లేదని చెప్పుకొచ్చారు. ఈ విషయాన్నీ మానెజ్మెంట్ దృష్టికి తీసుకెళ్లిన కూడా వాళ్ళు పట్టించుకోలేదని అంటున్నారు. హైదరాబాద్ లోని చాలా మాల్స్ లో సరైన వసతులు లేవని చెప్పారు. ఏదైనా పెద్ద ప్రమాదం జరగక ముందే అన్ని జాగ్రత్తలు పాటించాలని వాళ్ళు కోరుతున్నారు. ఈ విషయాన్నీ త్వరలో ప్రభుత్వానికి చేరవేస్తామని చెప్పుకొచ్చారు.

ఇక్కడున్న మరో విచిత్రమైన పాయింట్ ఏంటంటే ప్రమాదం అనేది తెలియకుండా జరిగేది కాని జరిగిన ప్రమాదం గురుంచి చుట్టూ నివసించే వాళ్ళకు కూడా తెలియకుండా మానెజ్మెంట్ తగు జాగ్రత్తలు తీసుకోవటంలో ఆంతర్యం ఏంటని కుటుంబంతో కలిసి సినిమా చూడటానికి వచ్చిన ఒక సాఫ్ట్ వెర్ ప్రేక్షకుడు వాపోతున్నాడు. మాములు సినిమా థియేటర్లో ఫైర్ సేఫ్టీ ఉండదని పెద్ద పెద్ద మల్టీప్లెక్స్ ల్లో తమకు రక్షణకు ఉంటుందని 250 టికెట్ పెట్టుకొని వస్తే తీరా ఇక్కడ కూడా జీవితానికి రక్షణ లేనపుడు మల్టీప్లెక్స్ ల్లో కి రావాలంటే భయమేస్తుందని చెప్పుకొచ్చాడు. ఈ విషయాన్నీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలని చెప్పుకొచ్చారు.

ఏది ఏమైనా డబ్బులు ఎక్కువ వసూల్ చేసే పెద్ద మల్టీప్లెక్సులు ఫైర్ సేఫ్టీ లు లేకుండా కొన్ని వేల మంది ప్రాణాలతో ఆడుకోవటంపైన ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలి.

. If you are victims of this accident,please share your data to telanganakaburlu@gmail.com.

 

Author Ravinder Ryada

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here