రైతు ఆత్మహత్యలకు కారణమవుతున్న సినీనటులు

0
1765
Farmers are Cheated by Film Actors
Farmers are Cheated by Film Actors
  భారత దేశం రైతు దేశం – వ్యవసాయ దేశం. వ్యవసాయమే ప్రథాన వృత్తిగా ఇక్కడి ప్రజలు ప్రపంచ దేశాలకి కావలసిన పంటలను పండిస్తూ చిన్న – పెద్ద, పేద – ధనిక అనే భేధాలు లేకుండా అందరికి కడుపు నిండా అన్నం పెడుతున్నారు.

  పరులకు ద్రోహం చేయడం, ఒకరిని మోసం చేయడం తెలియని రైతన్న రాత్రింబవళ్ళు కష్ట పడుతూ దేశానికి కావలసిన ఆహారధాన్యాలను పండిస్తూ ప్రతి ఒకరి ఆకలి తీరుస్తున్నాడు.

  దేశంలో వివిధ పనులు చేస్తూ ధనవంతులు అవుతున్న వారే కానీ రేయింబవళ్ళు కాయకష్టం చేస్తున్న రైతన్న కంటినిండా నిద్రపోయో రోజులు లేవు. స్వార్ధ రాజకీయాలు, మోసపూరిత వ్యాపారస్థులు రైతన్న జీవితాలతో చలగాటాలు ఆడుతున్నారు. ఇవి చాలనట్లు పంట చేతికొచ్చి నాలుగు రాళ్ళు వస్తాయని ఎదురు చూసే సమయంలో ఆ దేవుడు కూడ రైతన్నలపై చిన్న చూపుచూడటంతో వరదలు, ప్రకృతి వైపరిత్యాల వల్ల పంటలను కోల్పోతున్నారు.

  కానీ మన రైతన్న ధైర్యాన్ని కోల్పోకుండా నలుగురి కాళ్ళు పట్టుకొని ఐనా సరే అప్పు తెచ్చి మరీ తన పొలం దున్ని , విత్తనాలు కొని వ్యవసాయం చేస్తాడు. తెచ్చిన అప్పులు పీక మీద ఉన్న ధైర్యాన్ని కోల్పోకుండా పంట చేతికొచ్చే వరకి వేచిచూస్తాడు. కాని ఇక్కడ రైతన్న నాసి రకపు విత్తనాలు, పురుగు మందులు కొని మోసం పోతూ తన ధైర్యాన్నిచావు వైపుకు మలచుకొని ఆత్మహత్యలకు పాల్పడుతున్నాడు.

  కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అరాచకాన్నికి అడ్డు కట్ట వేయలేవు. మేడి పండు లాంటి రాజకీయనాయకులు రైతుల జీవితాలతో రాజకీయ పబ్బాలు గడుపుకొంటూ రైతన్నలకి యమపురి రహదారిని నిర్మిస్తూన్నారు. రాజకీయ నాయకులకి తోడు వ్యాపారస్తులు నకిలీ విత్తనాలను అమాయక రైతులకి అంటబెట్టడానికి సినీ నటులతో ప్రకటనలను నిర్మించి మోసం చేస్తున్నారు.

  24 గంటలు చిత్ర పరిశ్రమలో బిజీగా ఉండే సిని నటులు పైసలకు కక్కుర్తి పడి ప్రకటనలకు సై అంటూ రైతన్నల ఆత్మహత్యలకు కారణం అవుతున్నారు. వారు నటించే ప్రకటనలో ఎంత నిజం ఉంది? ఎంత అబద్దం ఉంది? అనేది వాళ్ళకి అవసరం లేదు. చిత్ర పరిశ్రమలో ఒక మంచి స్థానాన్ని సంపాదించి, వ్యవసాయాన్నికి సంబంధించిన ప్రకటనలు చేస్తూ దేశానికి అన్నం పెట్టే రైతన్న చావుకి కారణం అవుతున్నారు.

  వ్యవసాయం అంటే తెలియని కొందరు నటీ నటులు ఆ విత్తనాలని ఉపయోగించాలి, ఈ ఎరువులను వాడాలి అని ప్రకటనలు చేస్తూ రైతులను మోసం చేస్తున్నారు. వరదలు , ప్రకృతి వైపరిత్యాల ద్వార పంటలను కొల్పోతున్న రైతులను ఆదుకోవడానికి ముందుకు రాని కొందరు నటీ నటులు డబ్బు మీద వ్యామోహంతో ప్రకటలు చేస్తూ మన రైతన్నల మరణాలకి కారకులవుతున్నారు.

  ఇకనైన వ్యవసాయానికి సంబంధించిన ప్రకటనలు చేసే నటీ నటులు ఎన్ని ఎకరాలలో వ్యవసాయం చేసారు?. ఎంత దిగుబడి రాబట్టారు? అలాగే ఇతర ఆధారాలతో ప్రకటనలు చేయాలని మా విజ్ణప్తి. అలాగే రైతు సోదరులు కూడ టీ వీలలో , ఇతర ప్రకటన మాధ్యమాల ద్వార వచ్చే ప్రకటనలు నమ్మకుండ వ్యవసాయ శాఖ వారి సహాయంతో పంటకి కావలసిన సరైన విత్తనాలు, పురుగుల మందులు ఉపయోగించుకోవాలని మా మనవి.

  Author : Raju Avusharla

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here