గ్రేటర్ ఎన్నికల పైన ప్రముఖ జర్నలిస్ట్ దుర్గం రవీందర్ అభిప్రాయం

273 0

గ్రేటర్‌ ఎన్నికల్లో వోట్లు,సీట్లు పొందడం బీజేపీ కంటే కేసీఆర్‌కే ఎక్కువ అవసరం

గ్రేటర్‌ హైదరా బాద్ ఎన్నికల్లో రాజకీయాలు పోటా పోటీగా సాగుతున్నాయి.పోరు మొత్తం టీఆర్‌ఎస్‌–బీజేపీ మధ్య సాగుతున్నది.నగర రాజకీయ రసాయనంలో పెద్ద పక్షమే అయినా మజ్లీస్ ఉత్ప్రే రకంగా మాత్రమే మారింది. బీజేపీ కి ఇది కలిసి వచ్చింది. బీజేపీ రాజకీయాలను తీవ్రంగా వ్యతిరేకించే వామపక్ష భావాలున్న వారు కూడా కేసీఆర్‌ కు మద్దతు పలకని పరిస్తితి ఏర్పడింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి దర్నా చౌక్ ను రద్దు చేయడం లాంటి నిరంకుశ విధానాల కారణంగా తెలంగాణలో ప్రజాసంఘాలు, వామపక్షశక్తులు ఆయనకు సానుభూతిని ప్రకటించలేని స్థితిలో పడ్డాయి.
కాంగ్రెస్ ను పని గట్టుకుని కెసిఆర్ బలహీన పర్చాడు.వారికి స్థలం లేకుండా చేయ గలిగాడు ,వారు ఖాలి చేసిన తావులోకి ఇంకో రాజకీయ శక్తి వస్తుందని ఎందుకు ఊహించ లేదో మరి.దీనికి ఆయన భారీ ముల్యామే చెల్లించాల్సి రావచ్చు.దుబ్బాక,జి.హెచ్.ఎం.సి తో అది ఆగక పోవచ్చు.
రాష్ట్ర నాయకుల చేష్టల తో వామపక్షాలు బలహీనపడటం వల్ల ఈ ఎన్నికల్లో వారు ప్రత్యక్ష ప్రభావం చూపక పోయిన వారి పరోక్ష ప్రభావం భాగానే ఉంటుంది. గోరటి వెంకన్న,గద్దర్, ప్రొఫెసర్‌ హరగోపాల్‌ వంటి వారిసానుకూల మాటల వల్ల కలిగే ప్రయోజనం పెద్దగా ఉండక పోవచ్చు.
ఇలాంటి అనేక అంశాలు బీజేపీ కి కలిసి వచ్చాయి.దానికి అనుగుణంగానే బీజేపీ వ్యూహరచన చేసుకున్నది. బీజేపీకి బడా నాయకులందరూ హైదరాబాద్‌ లో ప్రచారం చేశారు. నగర పాలక సంస్థ కోసం ఇంతమంది నాయకులు రావడం విశేషం.
గ్రేటర్‌ ఎన్నికల్లో వోట్లు,సీట్లు పొందడం బీజేపీ కంటే కేసీఆర్‌కే ఎక్కువ అవసరం. గత కార్పొరేషన్ ఎన్నికల్లో 99 సీట్లు,43.85 % వోట్లు పొందిన టీఆర్‌ఎస్‌ కు ఇప్పుడు అంతకంటే తక్కువ వోట్లు వస్తే తెలంగాణా రాజకీయ చిత్ర పటం మారే అవకాశం ఉంది. టీఆర్‌ఎస్‌లో అసంతృప్తులు నోరు విప్పే అవకాశం ఉంది. అంతఃకలహాలు రేగే అవకాశంకూడా ఉంది. ఫలితాలు బీజేపీకి అనుకూలంగా ఉంటే బీజేపీలోకి దూకడానికి టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నుంచి పలువురు నాయకులు సిద్ధ పడడం సహజ పరిణామం.
మేయర్ పీఠాన్ని దక్కించుకొక పోయినా బలాన్ని పెంచుకోవడం వారి ఉద్దేశ్యం అని వారి మాటలు-చేతల వల్ల తెలుస్తున్నది..గత ఎన్నికల్లో బిజెపి 10 % వొట్లను సాదించుకుంది ఈ ఎన్నికల్లో దాదాపు 30 % పైగా పెరగ వచ్చు.దీంతో తెలంగాణలో వచ్చే ఎన్నికల నాటికి వారు ప్రదాన ప్రత్యర్థిగా ఎదగడం వారి వ్యూహం అయి ఉంటుంది.
వారి వ్యూహం పలిస్తున్నట్లే ఉన్నది.
జాతీయ నాయకులు దగ్గరగా తెలంగాణాపార్టీ స్థితి గతులను చూశారు కాబట్టి ఎన్నికల అనతరం పార్టీ నిర్మాణం లో కూడా మార్పులు ఉండ వచ్చు ,ఎందుకో తెలియదు కానీ కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డిని తప్పించ వచ్చని కూడా వినిపిస్తున్నది.సమర్దుడు కాక పోయినా బండి సంజయ్ కు పరిస్థితులు కలిసి వస్తున్నాయని కూడా పార్టీ వర్గాల వారే అనడం గమనార్హం. అన్ని ఆయుదాలు వాడి బీజేపీ తెలంగాణా లో బలపడే ప్రయత్నం చేస్తున్నది.

 

Source: Durgam Ravinder FB wall

Related Post

50 మంది వలస కూలీలకు సహాయం చేసిన తెలంగాణ విఠల్

Posted by - April 13, 2020 0
హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఫైనాన్షియల్ జిల్లాలో కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన 50మంది వలస కూలీల కోసం బియ్యం, పప్పులు మరియు నిత్యావసర సరకులను పంపిణీ చేసిన…

అమరవీరులకు నివాళులు అర్పించిన మాధవిలత

  సినిమా నటి, బిజెపి నాయకురాలు మాధవిలత భారత సరిహద్దులను కాపాడటానికి పోరాడి,అమరులు అయిన 20 మంది భారత సైనికులకు నివాళి అర్పించారు. హైదరాబాద్ లోని తన…

గల్ఫ్ అంశంలో రెండవ ఉత్తరం పంపిన కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్

Posted by - April 24, 2020 0
స్వగ్రామలకు తిరిగిరావడానికి సిద్ధంగా ఉన్న కార్మికులకు ప్రభుత్వం ఉచితంగా విమాన ప్రయాణం కల్పించాలి* గల్ఫ్ దేశాలలో ఉపాధి నిమిత్తం వేములవాడ నియోజకవర్గం మరియు తెలంగాణ రాష్ట్రం అన్ని…

కేంద్ర బడ్జెట్-2021 పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారి ప్రతిస్పందన

Posted by - February 3, 2021 0
  ప్రధాని నరేంద్రమోదీ గారి ఆలోచనలకు అనుగుణంగా 5 ట్రిలియన్ డాలర్ల భారీ ఆర్థిక వ్యవస్థను, ఆత్మనిర్భర్ భారత్‌ను నిర్మించే దిశగా ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా…

ఆలేరు మాజీ శాసనసభ్యులు చల్లూరు పోచయ్య మృతి

Posted by - May 14, 2020 0
ఆలేరు మాజీ MLA,చల్లూరు పోచయ్య గారు(85) కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ లోని డెక్కన్ హాస్పిటల్ లో గుండెపోటుతో మృతి. 1978 నుండి 1983 వరకు ఆలేరు శాసన…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *