జానారెడ్డి ని ఓడించిన మాజి ఎమ్మెల్యే కన్నుమూత

0
50

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు,తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ కాలం మంత్రి పదవిలో ఉండి రికార్డ్ సృష్టించిన జానారెడ్డి మొదటిసారి ఓటమి చవిచూసింది 1994 లో.అపుడు ఆయన మీద గెలిచిన నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ (పాత చలకుర్తి )నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గుండెబోయిన రామ్మూర్తి యాదవ్ గారు అర్ధరాత్రి కన్ను మూశారు

1994 నుంచి 1999 వరకు అప్పటి చలకుర్తి నియోజకవర్గములో ఎమ్మెల్యే ఆయన సేవలు అందించారు. ఓటమి ఎరుగని మాజీ మంత్రి జానారెడ్డి పై ఘన విజయం సాధించారు. బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన రాంమూర్తి యాదవ్ పేద ప్రజల అభ్యున్నతి కోసం తన జీవితాంతం తాపత్రయ పడ్డారు. 1947 అక్టోబర్ 26 న గుండెబోయిన మట్టయ్య, మహా లక్ష్మమ్మ దంపతుల కుమారుడిగా ఆయన జన్మించారు.1981 లో పెద్ద దేవుల పల్లి గ్రామ సర్పంచ్ తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. రాజకీయాల్లో ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితులు గా ఉన్న రాంమూర్తి యాదవ్.. నియోజకవర్గ ప్రజలకే కాకుండా రాష్ర్ట వ్యాప్తంగా ఎందరికో సుపరిచితులు గా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్దిస్తున్న సమయంలో అప్పటి ఉద్యమ నాయకునిగా ఉన్న కేసీఆర్ సమక్షంలో టీఆర్ యస్ పార్టీ లోకి వచ్చారు. ఆయన ఏ పార్టీ లో ఉన్నా అందరి కి అజాత శత్రువు గా ఉన్న అరుదైన రాజకీయ నాయకుడిగా పేరు సంపాందించారు. బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చి ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించిన గుండెబోయిన రామ్మూర్తి యాదవ్ గారు ఆయన తుది శ్వాస విడిచే వరకు పేదల పక్షాన పోరాడారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here