సెప్టెంబర్ నెలలో భూమి అంతం అవుతుందని భౌగోళిక పరిశోధకుడు…

0
275
end of the world september 2017
end of the world september 2017

కాన్ స్పిరిసీ ధియరిస్ట్ డేవిడ్ మీడ్… ఈయన భౌగోళిక పరిశోధకుడు,ప్రముఖ న్యూమరాలజిస్ట్. భూమి అంతం అవుతుందని ఏడాది కాలంగా గట్టిగా చెబుతున్నాడు. వాస్తవంగా అయితే ఇలాంటి వార్తలన్నీ ఫేక్ న్యూస్ అని ప్రజలు నమ్మరు కాకపోతే ఇది జరిగి తీరుతుందని ప్రపంచవ్యాప్తంగా రోజు రోజుకు ప్రచారం ఎక్కువైపోతుంది. 2017 సెప్టెంబర్ 20 – 23 తేదీల్లో భూమిని భారీ గ్రహం ఢీకొంటుందని.. భూమి బద్దలవుతుందని చెబుతున్నారు. సెప్టెంబర్ నెలలో నిబిరు గ్రహాన్ని ఆకాశంలో స్పష్టంగా చూడగలమని చెబుతున్నాడు డేవిడ్ మీడ్.

నిబిరు అనేది సౌర కుటుంబానికి అతి సమీపంలో ఉన్న ఓ గ్రహం. కొన్ని వందల సంవత్సరాల క్రితం నిబిరు.. గ్రహ కక్ష్యలోకి ప్రవేశించి చిన్న చిన్ని గ్రహాలను నాశనం చేసిందని చెబుతుంటారు శాస్త్రవేత్తలు. ఈసారి గ్రహాల కక్ష్య దాటి భూ కక్ష్యలోకి ప్రవేశించనుందని.. భూమిని బద్దలు చేయబోతుందని చెబుతున్నారు. నిబిరు దాడితో కొన్ని జీవరాశులే అంతం అయ్యే అవకాశం ఉందని భయపెడుతున్నారు డేవిడ్ మీడ్. ఇది పరిశోధనలతో తేల్చి చెబుతున్నానని అంటూనే.. బైబిల్ తో పాటు గిజా పిరమిడ్స్ లోనూ ఈ అంశం స్పష్టం ఉందని సాక్ష్యాలు చూపిస్తున్నారు.

ఇది నిజమో అబద్దమో తెలియాలంటే మరో నెల రోజులు ఆగాలి. గతంలో 2012లో భూమి అంతం అని ఎంతో ప్రచారం జరిగింది. తరచూ ఇలాంటి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈసారి కూడా అంతర్జాతీయంగా వెబ్ సైట్లు, ఛానల్స్ లో వీటిపై ప్రచారం జోరుగా సాగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here