హైదరాబాద్ లో మరో డ్రగ్స్ ముఠా అరెస్ట్

0
378
Drugs sellers are arrested in hyderabad
Drugs sellers are arrested in hyderabad

హైదరాబాద్ బంజారాహిల్స్ లో మరో డ్రగ్ ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇందులో ఒకరు ఆఫ్రికాకు చెందిన వ్యక్తి మరోకరు హైదరాబాద్ వ్యక్తి. ఇద్దరి నుంచి 20 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దీంతో ఇప్పటికి మొత్తం డ్రగ్స్ దందాకు సంబందించిన 12 మందిని పోలీసులు అరెస్ట్ చేసారు. పరారీలో ఉన్న మరో నలుగురి కోసం వెతుకుతున్నారు. అంతేకాకుండా ఈ ముఠాకి ఎవరెవరితో లింకులు ఉన్నాయో తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ఈ విచారణలో హైదరాబాద్ , గోవాతో పాటు ఢిల్లీ నుంచి కూడా డ్రగ్స్ వస్తున్నాయని పోలీసులు గుర్తించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here