మూఢనమ్మకాల పైన విద్యార్థులకు అవగాహణ తరగతులు

0
420
    నిజామాబాదు జిల్లాలో కమ్మరపల్లి మండలం బషీరాబాద్ గ్రామంలో ఉన్నత పాఠశాలలో జిల్లాలోని ప్రముఖ సైకాలజీస్ట్ డాక్టర్ ,సామాజికవేత్త డా.విశాల్ గారి ఆధ్వర్యంలో విద్యార్థులకు మూఢనమ్మకాల పై అవగాహన కార్యక్రమము చేపట్టడం జరిగింది. డాక్టర్ విశాల్ విద్యార్థులతో మాట్లాడుతూ మూఢనమ్మల వలన మన జీవితాలు వెనుకబడి పోతాయని సూచించారు. ఇలాంటి విన్నూత్న కార్యక్రమాలు చేస్తున్న బషీరాబాద్ గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ , గ్రామ కమిటీ ,విద్యా కమిటీ ,ఉపాధ్యాయ సిబ్బంది కి ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయంలో బషీరాబాద్ జిల్లాలో ఆదర్శ గ్రామంగా నిలుస్తుందని తెలిపారు.
      ఈ కార్యక్రమంలో బషీరాబాద్ గ్రామ సర్పంచ్ బోడా జమున దేవేందర్ ,ఎంపీటీసీ సుంకే మురళి ,వీడీసీ అధ్యక్షులు ఆకుల లింగన్న ,ప్రధాన ఉపాధ్యాయులు గంగారాం ,గ్రామా కమిటీ కమిటీ ,విద్యా కమిటీ ,ఉపాధ్యాయ సిబ్బంది,విద్యార్థులు పాల్గొన్నారు. దీనికి గ్రామానికి చెందిన ఆకుల మోహన్ సమన్వయకర్తగా వ్యవహరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here