సంగీతం మీద అరుదైన పుస్తకం రాసిన ప్రముఖ తెలుగు వైద్యుడు

0
291

ఇప్పటివరకు వైద్యులు రాజకీయ రంగంలోకి వెళ్లారు ,సినిమా రంగంలోకి వెళ్లారు. కాని సంగీత రంగంలో ఒక వైద్యుడు రాణించటం అంటే అరుదైన విషయం. అలాంటిది మన తెలంగాణ వైద్యుడు సంగీతం మీద పూర్తి పట్టు సాధించి భారతీయ సంగీతాన్ని నేర్చుకోవటానికి ఒక అద్బుదమైన గైడ్ లాంటి పుస్తకం రాయటం అంటే సాధారణ విషయం కాదు. అది కూడా లాప్రోస్కోపిక్ లాంటి ఆధునిక వైద్య రంగంలో టాప్ మోస్ట్ డాక్టర్ గా ఉంటూ ఇలాంటి పుస్తకం రాయటం అంటే మాములు విషయం కాదు.

అసలు విషయానికొస్తే భారతదేశంలో లాప్రోస్కోపిక్ విభాగంలో టాప్ డాక్టర్ అయిన నగరానికి చెందిన డాక్టర్ వరుణ్ రాజ్ తిరుమలగిరి గారు సంగీతం మీద ” మేళకర్తల 72 అంబియాన్స్ ” రచించిన పుస్తకాన్నిఆదివారం హైదరాబాద్ కమిషనర్ జనార్దన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరించటం జరిగింది. సంక్లిష్టమైన భారతీయ సంగీతాన్ని సులువుగా నేర్చుకోవటానికి ఈ పుస్తకం ఉపయోగపడుతుందని వరుణ్ రాజ్ గారు తెలియచేశారు. కమిషనర్ జనార్దన్ రెడ్డి గారు మాట్లాడుతూ వరుణ్ రాజ్ నాకు బ్యాడ్మింటన్ స్నేహితుడని సంగీతం ఆటలో కూడా అయన గెలవాలని అన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here