హైటెక్ సిటీ లో హోటల్ పెడుతున్న దర్శకుడి తనయుడు

0
791

ఒకప్పుడు ఏదైనా రంగంలో ఉంటె దానికే పరిమితం అయ్యేవారు ,ఆదాయం ఎంత ఉన్న కూడా వేరే దాంట్లో వేలు పెట్టె వారు కాదు కాని కాలం మారింది. … ప్రతి ఒక్కరు బిజినెస్ లోకి అడుగు పెట్టి తమ దగ్గరున్న డబ్బును మల్టీ ప్లయ్ చేయటానికి అదృష్టం టెస్ట్ చేసుకుంటారు. ఇక సినిమా ఇండస్ట్రీ ,సాఫ్ట్ వేర్ వాళ్ళైతే మరీను… దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకునే విదంగా ఆలోచనలు చేస్తున్నారు. నాగార్జున ,రాఘవేంద్ర రావు ,ఎల్ .వి ప్రసాద్, శోభన్ బాబు ,మురళి మోహన్ ,చిరంజీవి లాంటి వాళ్ళు రెండు పడవల మీద కాళ్ళు పెట్టి విజయవంతం అయ్యారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ ,హోటల్ బిసినెస్ లలో వీళ్ళు అడుగు పెట్టి విజయవంతం అయ్యారు. ఎందుకంటే ఈ రెండు ఎవర్ గ్రీన్ వ్యాపారాలు.
ఐతే సినిమా ఇండస్ట్రీ లో నుంచి మరొక సెలేబ్రేటి హోటల్ వ్యాపారంలోకి వస్తున్నాడు . గత ఏడాది బ్లాక్ బ్లాస్టర్ ఇచ్చిన ఒక దర్శకుడి కొడుకు హైటెక్ సిటీ లో ఒక పెద్ద ఫుడ్ కోర్ట్ లాంచ్ చేస్తున్నాడని సమాచారం. సినిమా కుటుంబం నుంచి వచ్చిన ఇయన కూడా కొన్ని సినిమాలకు వాళ్ళ నాన్న దగ్గర అసిస్టెంట్ గా పనిచేసాడు. బయట సినిమాలకు థియేటర్ ట్రైలర్ కట్ చేసే ఇయన చిన్న వయసులో పెద్ద వ్యాపారంలోకి రావటం అందరిని ఆశ్యర్యం లోకి నెట్టేస్తుంది . నిజానికి ఇక్కడ ఓపెన్ ఫుడ్ కోర్ట్ లు చాల తక్కువ ,సింగపూర్ ,మలేసియా ,బ్యాంకాక్ లాంటి దేశాల్లో పెద్ద పెద్ద ఫుడ్ కోర్ట్ లు చాల దర్శనిమిస్తాయి. అలంటి కోర్ట్ ని త్వరలో స్టార్ట్ చేస్తున్నాడు. లక్షకు పైగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులున్న హైటెక్ సిటీ ఫుడ్ బిజినెస్ అంటే బంగారు గని లాంటిది. సినిమాల్లో లాగా అయన వ్యాపారంలో కూడా సక్సెస్ కావాలని కోరుదాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here