డిజిటల్ ట్రాన్సక్షన్స్ లో తెలంగాణ మొదటి స్థానం…

0
305

హైదరాబాద్ లోని కాచిగూడలో  నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో నిర్వహించిన “చిన్న మధ్య తరహా వ్యాపారస్తులకు డిజిటల్ పేమెంట్ ట్రైనింగ్” కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రభుత్వ సలహాదారు వివేకానంద మాట్లాడుతూ డిజిటల్ ట్రాన్సక్షన్స్ లో తెలంగాణ ముందుంది అన్నారు. ట్రేడెర్స్ కి డిజిటల్ పెమెంట్స్ పై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్న వివేక్.. ఇండియాలో క్యాష్ ట్రాన్సక్షన్స్ ఒక ఆచారంలో ఉండేదన్నారు. ఇప్పుడు ఇండియా డిజిటల్ ట్రాన్సక్షన్స్ వైపు అడుగులు వేస్తుందని.. GST తర్వాత ఇన్ పుట్ టాక్స్, క్రెడిట్, వే బిల్లులపై ట్రేడెర్స్, వ్యాపారస్తులకు మరింత అవగాహన కల్పించాలన్నారు వివేక్. తెలంగాణలోని ప్రతి జిల్లాలో కూడా ఇలాంటి అవేర్ నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహించాలని కొత్తగా వచ్చే టెక్నాలజీతో ట్రేడెర్స్, వ్యాపారస్తులు అప్ డేట్ కావాలని సూచించారు వివేకానంద.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here