వన్డేల్లో 200 కొట్టిన ధోని

0
726
dhoni new record
dhoni new record
    ఇండియా క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మరో సారి తన ధనా ధన్ షాట్స్ లతో అభిమానులకు అలరించాడు. ప్రస్తుతం వెస్టీండీస్ తో జరుగుతున్న 5 వన్డేల సిరీస్ లో నిన్న జరిగిన 3వ వన్డే మ్యాచ్ లో కొత్త రికార్డ్ ను సొంతం చేసుకోవడమే కాకుండ ఇండియా సాధించిన విజయంలో కీలక పాత్ర పోషించాడు.
    ఫోర్లూ , సిక్సర్లతో అభిమానులను అలరించే ధోని నిన్నటి మ్యాచ్ లో 2 సిక్సర్లు బాదీ టీమిండియాలో అరుదైన రికార్డ్ ను కైవసం చేసుకున్నాడు. వన్డేల్లో 200 సిక్సర్లు కొట్టిన భారతీయ క్రికెట్ ఆటగాడిగా రికార్డ్ నమోదు చేసాడు. వన్డే , టెస్ట్ , టీ-20 అన్ని మ్యాచ్ లలో 322 సిక్సర్లు కొట్టిన ధోని , వన్డేల్లో అత్యధిక సిక్స్ ల జాబితాలో ధోని, టెస్ట్ మ్యాచ్ లలో సెహ్వాగ్ , టీ-20 లలో యువరాజు పేరులలో ఉంది.
    భారత్ – వెస్టీండిస్ మధ్య జరిగిన 3వ వన్డేలో ధోని 78 బంతులలో 79 పరుగులతో నాటౌట్ గా నిలిచి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here