స్టార్ మేకింగ్ విషయంలో సీనియర్ దాసరిని అనుసరిస్తున్న జూనియర్ దాసరి

0
425
తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో ,స్టార్ హీరో ,సూపర్ స్టార్ లు అంటు విభజన ఎప్పటినుంచే ఉంది. స్టార్ హీరో ఐతే ఓపెనింగ్స్ తో సినిమా కి మార్కెటింగ్ సమస్యలు ఉండవు ,థియేటర్ సమస్యలు ఉండవు. మంచి సాటిలైట్ ధరలు కూడా పలుకుతాయి. అదే మాములు హీరో ఐతే సినిమా టాక్ బట్టి బిజినెస్ ఉంటుంది ఒక్కోసారి సినిమా బాగున్నా కూడా థియేటర్ సమస్యలు వస్తాయి. ఐతే ఇండస్ట్రీలో ప్రతి హీరో స్టార్ హీరో ఇమేజ్ రావాలని చాల కష్టపడుతుంటారు. ఎంత కష్టపడ్డా కూడా వాళ్ళు ఎంచుకునే కథలు ,వాళ్లకు కథలు చెప్పే డైరెక్టర్ల పైనే అదరపడాల్సిందే. ఒక విదంగా చెప్పాలంటే స్టార్ హీరోలను తయారుచేయాలంటే కచ్చితంగా దర్శకులదే సింహ భాగం.

మెగాస్టార్ చిరంజీవికి కోదండరామ్ రెడ్డి కథల వలన స్టార్ హీరో ఐతే కె రాఘవేంద్ర రావు కథల వలన సూపర్ స్టార్ అయ్యాడు. బాలయ్య బాబుని కోడి రామకృష్ణ ,బి.గోపాల్ లు స్టార్ హీరోలుగా చేశారు. నాగ్ ని వర్మ ,వెంకీ ని బి గోపాల్ ,పవన్ కళ్యాణ్ ని కరుణాకరన్ ,మహేష్ ని పూరి ,బన్నీని సుకుమార్ ,చరణ్ ని రాజమౌళి ,తారక్ ని వినాయక్ ,రాజమౌళి ,ప్రభాస్ ని స్టార్ హీరో ,సూపర్ స్టార్ ని చేసింది రాజమౌళి కథలే . ఒకప్పుడు దాసరి నారాయణ రావు గారి కథలు ఎన్టీఆర్ ,ఏఎన్నార్ ,శోభన్ లను స్టార్ హీరోలను చేసి స్టార్ మేకర్ గా వెలుగొందాడు.

ఐతే ఈ కాలంలో సీనియర్ దాసరి అడుగుజాడల్లో జూనియర్ దాసరి నడుస్తున్నట్టు అనిపిస్తుంది. అదేనండి దాసరి మారుతి గారు . ఎంతో మంది కొత్త ఆర్టిసులను ,కొత్త టెక్నిషియన్స్ ని వెలుగులోకి తెస్తూ కేవలం 5డి కెమెరాతో ఒక ఫీచర్ ఫిలిం తీసి హిట్ కొట్టాడు. ఇపుడు అయన ఇపుడు ఇద్దరు మామూలు హీరోలను స్టార్ హీరోలుగా మార్చేశాడు తన కథలతో. ఒకరు నాని ఐతే మరొకరు శర్వానంద్. నానికి భలే భలే సినిమా వచ్చేంతవరకు హిట్ సినిమాలు వచ్చినా కూడా మినిమం గ్యారెంటీ హీరోగా మాత్రం నిలదొక్కుకోలేకపోయాడు. ఆ సినిమా తర్వాత అమెరికాలో నాని మార్కెట్ చాల పెరిగి పోయింది ఎంతలా అంటే కంటెంట్ పరంగా బలహీనంగా ఉన్న జెంటిల్మెన్ ,కృష్ణ గాడి ప్రేమ కథ సినిమాలు కూడా మంచి వసూళ్లను రాబట్టాయి. ఇపుడు మహానుభావుడు సినిమాతో శర్వానంద్ కి కూడా మంచి మార్కెట్ ఏర్పడినట్లు సమాచారం. ఇప్పటికే రన్ రాజా రన్ ,శతమానం భవతి సినిమాలు పెద్ద హిట్ అయినా కూడా ఇంకా స్టార్ ఇమేజ్ రాలేదని చెప్పాలి కాని ఈ లేటెస్ట్ సినిమాతో శర్వకి మంచి రోజులు వచ్చాయని చెబుతున్నారు.

భవిష్యత్తులో మారుతి గారు సీనియర్ దాసరి గారి అడుగుజాడల్లో నడుస్తూ మరెంతో మంది స్టార్ హీరోలను తయారు చేయాలని ఆశిద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here