దాసరి లేని లోటు తెలిసిపోతుందా?

0
669
dasari abscene consequences tollywood crisis
dasari abscene consequences tollywood crisis
    దాసరి నారాయణరావు,ఈ పేరు వింటే తెలుగు ఇండస్ట్రీ కి ఒక పెద్దరికం గుర్తుకొచ్చేది.దాదాపు 30 ఏళ్ల పాటు ఇండస్ట్రీలో ఏదైనా సంక్షోభం వస్తే ముందుండి మరీ సమస్యను పరిష్కరించేవాడు. ముఖ్యంగా చిన్న నటులకు ,చిన్న నిర్మాతలకు ,చిన్న సినిమాలకు మాత్రం బాసటగా నిలిచేవాడు. కాని దురదృష్టవశాత్తు గత నెల అయన చనిపోవటంతో భవిష్యత్తులో అయన స్థానాన్ని పూరించేవాళ్ళు రారని అందరు అనుకున్నారు. కాని అయన చనిపోయాక నెల లోపే అయన లేని లోటు కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని అయన ప్రియశిష్యుడు ఒకాయన అభిప్రాయపడ్డాడు.
    అసలు విషయానికొస్తే గత వారం పది రోజులుగా టాలీవుడ్ లో ఎపుడు లేని సంక్షోభాలకు దారితీసింది. డ్రగ్స్ వ్యవహారంలో చాల మంది తెలుగు పరిశ్రమ కి చెందిన వాళ్ళను సిట్ విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో చాల మంది సినీ పెద్దల కొడుకుల పాత్ర ఉన్నా కూడా చిన్న చేపల పైనే గాలం వేసిందని విమర్శలు వచ్చాయి. ఈ తరుణంలో పూరి ట్విట్టర్ లో ఇచ్చిన తన వీడియోకి చాల సానుభూతి వచ్చింది.
    ఈ సందర్భంలో దాసరి ప్రియశిష్యుడు ,ప్రముఖ రాజకీయనాయకుడు గంధం కరుణాకర్ నాయుడు దాసరి గారితో తన అనుబంధాన్ని ,అయన గొప్పదనాన్ని తెలియచేస్తూ ఈ సమయంలో దాసరి గారు ఉండి ఉంటె తెలంగాణ ప్రభుత్వంతో సామరస్య చర్చలు జరిపేవాడని,ఇపుడు ఆలా అన్ని వర్గాలను సమన్వయపరిచే సినీ పెద్ద కరువయ్యాడని తెలియచేశాడు. ప్రధానంగా డ్రగ్స్ తీసుకున్న నటులను ,సాంకేతిక నిపుణులను రహస్యంగా విచారించి ఒకవేళ తప్పు రుజువైతే వాళ్ళను బాహాటంగా శిక్షిస్తే బాగుండేదని ,ముందే మీడియాకి లీక్ చేసి అందులో తప్పు చేయని వాళ్ళ కెరీర్ నాశనం చేస్తున్నారని చెప్పుకొచ్చాడు. ఇలాంటి సంక్షోభాలు ఇండస్ట్రీలో ఎన్నో వచ్చాయని కాని దాసరి తన చాకచక్యంతో సమస్యను సామరస్యంగా పరిష్కరించారని చెప్పాడు. తెలుగు ఇండస్ట్రీ హైదరాబాద్ కి వచ్చిన కొత్తలో దాసరి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఇండస్ట్రీ ని హైదరాబాద్ లో స్థిరపడేలా చేశారని చెప్పాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here