డిఎస్ తెరాస లోకి వెళ్లటాన్ని సమర్థించిన దానం

0
863

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దానం నాగేందర్ ఏది చెప్పిన కూడా ముక్కు సూటిగా ఉంటుంది. ఒక విషయం పైన మాట్లాడటం మొదలు పెడితే సొంతపార్టీ వాళ్ళ పైన కూడా విమర్శలు చేయటానికి వెనుకాడడు. ఐతే అయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో డి శ్రీనివాస్ పైన ప్రశంసలు కురిపించాడు. డిఎస్ మంచి వ్యూహకర్త అని ,రెండు సార్లు పార్టీని అధికారంలోకి తేవటానికి కృషి చేసాడని,అయన సేవలు కాంగ్రెస్ కి అవసరమని చెప్పాడు. డిఎస్ తెరాస లోకి వెళ్ళటం సబబేనా అని యాంకర్ అడిగిన ప్రశ్న కి దానం సమాధానమిస్తూ అయన తెరాస కి వెళ్ళటం సబబే అని ,పార్టీ ఆయన్ని బాగా అవమానించిందని,ఎమ్మెల్సీ విషయంలో ఆయన్ని అడగకుండా అయన శిష్యురాలు ఆకుల లలిత కి టికెట్ ఇచ్చారని,కనీసం ఆయన్ని చెప్పి ఉంటె బాగుండేది అని డిఎస్ కి సపోర్ట్ చేసాడు. ఈ ఇంటర్వ్యూ లో తెలంగాణ విషయంలో కాంగ్రెస్ చేసిన తప్పులు ,ఒప్పులు ,జగన్ డైనమిజం ,రోశయ్య ముఖ్యమంత్రి సమయంలో ఉన్న పరిస్థితులు చెప్పాడు. 2004 లో తనకు టికెట్ రాకపోవటానికి డిఎస్ కారణం కాదని అది మజ్లీస్ కంచుకోట కావటం వలన మజ్లీస్ వాళ్ళు చేసిన కుట్ర అని చెప్పి డిఎస్ తో ఉన్న అనుబంధం గురుంచి చెప్పాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here