రణరంగమైన ధర్నాచౌక్

0
351
critical situation at dharna chowk
critical situation at dharna chowk
    ఇందిరా పార్క్ సమీపం లోని ధర్నా చౌక్ రణ రంగంగా మారుతుంది. ఒక ప్రక్కన్న జేఎసీ మరోపక్క స్థానికులు, వాకర్స్ అసొసియేషన్ సభ్యులు పోటాపోటీ గా ఆందోళనలు చేస్తున్నారు. ఈ రోజు జేఏసీ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ దగ్గరలోని ధర్నాచౌక్ తరలింపును వ్యతిరేకిస్తూ ఆందోళనకు సిద్ధమైంది . దీంతో పోలీసులు ఇందిరాపార్క్ దగ్గర గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు . అలాగే పారామిలటరీ బలగాలను కూడా అందుబాటులో ఉంచారు. పోటా పోటీ నిరసనలతోటి ఇందిరా పార్క్ దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది.
    బండమైసమ్మ కమ్యూనిటీ హాల్ లో సోమవారం ఉదయం వాకర్స్ అసోషియేషన్లు, ఇండియన్ బుల్స్ అసోసియేషన్, జలవాయి టవర్స్, భీమనగర్ వెల్ఫేర్ అసోషియేషన్, సమావేశమయ్యాయి. ఈ సమావేశంలో ధర్నా చౌక్ దగ్గర రోజూ ధర్నాలు, ఆందోళనలతో ఇందిరాపార్క్ పరిసరాలు గందరగోళంగా మారుతుందన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులతో పాటు సౌండ్ పొలుష్యన్, వేస్టేజీ చెత్తాచెదారంతో డస్ట్ గా మారుతోందన్నారు. అందుకే ధర్నా చౌక్ ను ఇక్కడ నుంచి తీసేయాలని డిమాండ్ చేశారు.

    ఐతే అక్కడ వామపక్ష నేతలకి , కాలనీ వాసులకి మధ్య యుద్ధ వాతావరణం మొదలైంది. అక్కడ వామపక్ష నేతలకి , కాలనీ వాసుల మధ్య వాగ్వివాదం ఎక్కువడంతో కుర్చీలు కర్రలతో ఇరువర్గాలు దాడి చేసుకున్నారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేసి ఇరువర్గాలను అక్కడి నుండి పంపించేసారు.

    అలాగే ఇటీవల కేసిఆర్ కూడా ధర్న చౌక్ విషయంలో కాస్త ఘాటుగానే స్పందించారు.”ధర్నా ఎక్కడ చేసినా ఒక్కటే కదా..!” ప్రజలకి ఇబ్బందులు ఏర్పడకుండా చూసుకోవాలని సూచించారు. అలాగే ధర్నా చౌక్ ఎక్కడ ఉంటే ఏమిటి? సమస్య తెలిస్తే సరిపోతుంది కదా అని ప్రశ్నించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here