దేశ/రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా లాక్ డౌన్ విధించడం జరిగిందని,తెలంగాణ రాష్ట్ర కరోనా వైరస్ మహమ్మరిని అరికంటెందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటుందని అన్నారు మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ.వి జగదీశ్వర్ గౌడ్ గారు..ఈరోజు హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని ప్రకాష్ నగర్,సబ్ స్టేషన్ వద్ద ఉన్న గుడిశెలో నివాసముండే 100కుటుంబాలకు జెనప్యాక్ ఉద్యోగి శ్రీమతి.శ్రీ.కౌశికి గారి సహకారంతో నిత్యావసర సరుకులను అందించారు మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు..
కార్పొరేటర్ గారు మాట్లాడుతూ..
ప్రజలు ఇళ్లలోనే ఉంటూ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తగుజాగ్రతలు తీసుకోవాలని,భయటకి వచ్చి ఇంట్లోకి వెళ్లే సమయంలో పరిశుభ్రత పాటించాలని విజ్ఞప్తి చేసారు..ఈ కార్యక్రమంలో బల్లింగ్ యాదగిరి గౌడ్,వార్డ్ సభ్యులు వెంకటేష్ గౌడ్,సయ్యద, నగరాజ్,సాయి కృష్ణ,రోహిత్,బాబు తదితరులు పాల్గొన్నారు…