మరక మంచిదే అన్నట్లు..కరోనా సంక్షోభం చిన్న సినిమాల పాలిట ఓటిటి వేదిక రూపంలో వరంగా మారింది.ఇపుడు కరోనా పెద్ద చిన్న సినిమా తేడా లేకుండా ప్రజాస్వామ్యన్నీ చక్కగా పాటిస్తుంది.
థియేటర్లు చిన్న సినిమాలకు దొరకడం లేదని దశాబ్దాలుగా ఒక సమాంతర ఉద్యమం నడుస్తూనే ఉంది.ప్రతి సంక్రాంతి దసరాకు ఈ ఉద్యమ తాలూకు చప్పుళ్ళు వినిపిస్తూనే ఉంటాయి.అయితే కరోనా లాక్ డౌన్ పుణ్యమా అని ప్రజలు ఇంటి పట్టునే ఉండటం,థియేటర్లు మూసేయటం వల్ల సినిమాలు అమెజాన్ ప్రైమ్,సన్ నెక్ట్,జీ లాంటి ఓటిటి వేదికలకు భలే డిమాండ్ పెరిగింది.ఇపుడు పెద్ద సినిమాలు కూడా ఓటిటి ప్లాట్ఫాటమ్ లో విడుదల చేయొచ్చని ప్రయత్నాలు మొదలు అయ్యయి.ఇక చిన్న సినిమాలు కూడా ఇదే ఇవే వేదికలపై విడుదల చేస్తూ వారి సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్తున్నారు.ఈ మధ్య షూట్ ఔట్ అనే సినిమా వచ్చి హిట్ అయింది.ఈ నెల 29 న అమృతరమం అనే సినిమా కూడా జీఈఈ5 లో విడుదల కాబోతుంది అనే విషయం ప్రముఖ దర్శక నిర్మాత మధుర శ్రీధర్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేయడం జరిగింది. మనుష్యులను సమానంగా చూస్తున్న కరోన,సినిమాల మధ్య బేధాలు లేకుండా పరిపాలించటం విశేషం. ఏమైనా మరక మంచిదే.
Ravinder Ryada
https://t.co/d9gFFYYiZz