జూన్8న మృగశిరకార్తె సందర్భంగా ప్రతి సంవత్సరం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహించే చేప ప్రసాదం పంపిణీకి ఈ ఏడాది కరోనా వైరస్ కారణంగా పంపిణీ చేయడం లేదని బత్తిని హరినాథ్ గౌడ్ తెలిపారు. 175 ఏళ్లుగా మృగశిర కార్తె రోజున ఈ ప్రసాదాన్ని ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు పంపిణి చేస్తున్నామని, ఈ సంవత్సరం కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగం పంపిణీ చేయడం లేదని బత్తిన సోదరులు ప్రకటించారు.
చేప ప్రసాదం ఆన్ లైన్ లో పంపుతామన్నా, చేప ప్రసాదం పంపిణి ఉందని ఎవరైనా ప్రచారం చేసిన నమ్మి హైదరాబాద్ రావొద్దని వారు కోరారు.బత్తిని సోదరుల పేరిట చేప ప్రసాదం పంపిణీ చేస్తే, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.