కరోనా మన ఇల్లరికం అల్లుడు ..?


ఎందుకంటే? మనదేశం లో 5000 కరోనా కేసులు ఉంటే ?దేశమంతా !లాక్ డౌన్ పెట్టాం …!
ఇప్పుడు 50 ,000/- పై చిలుకు పెరిగిపోతుంటే ?లాక్ డౌన్ ఎత్తివేసినం .
ఇక్కడే ఉంది మతలబు ఇల్లరికం వచ్చిన అల్లుడు ఇల్లు వదలిపోడు ఈ కరోనా అంతే !పాలకులు సన్నాయి నొక్కులు నుక్కుతున్నారు .
అందుకే మన పాలకులు కరోనా ఇల్లరికం అల్లుడు పోడని సోయిలోకి వచ్చినారు .
ఇగ మూతికి గుడ్డలు ,దూరం ..దూరం పాటించడాలు ,చేతులు కడుకుండుడు శానిటైజెర్లు రుద్దుకునుడు ఇవే అల్లునికి అత్తగారి పెట్టిపోతలు ..
ఈ మాత్రం దానికి లాక్ డౌన్ ఎందుకు పెట్టినట్టు ఏమన్నా కరోనా కట్టడి అయ్యిందా !
ఏమిలేదు గాని దివాళాతీసిన పాలకుల ఖజానా మాత్రం కరోనా నిప్పి ఇజ్జత్ నిలబెట్టింది .
కోట్లకు కోట్లు పియం ,సీఎం ఫండులకు పనులు చేయించుకునే బడా బాబులైతే బాగానే పంపిండ్రు
ఇదే సందు అనుకోని పాలకులు ప్రభుత్వఉద్యోగుల జీతాలు సగానికి తెగ నరికిండ్రు ,మల్ల ఇట్లైతే బదనాం ఐతామేమో నని ప్రజాప్రతినిదుల జీతభత్యాలకు కోత పెట్టిండ్రు ,సందెట్లో సడేమియా అన్నట్లు రాజకీయ నాయకులూ అధిష్టానం మెప్పులకోసం వాళ్ళ నియోజకవర్గాల పరిధిలో సీఎం ,పియం రిలీఫ్ ఫండ్లకు చెక్కుల రూపంలో ఫండులు వసూలు చేసిండ్రు .
ఏది ఏమైనప్పటికి కరోనా వసూలు రాజాలకు కామధేనువు అని చెప్పొచ్చు అంటున్నారు ప్రజలు
ఎందుకంటే కరోనా నియమ నిబంధనలు పాటించకుంటే జరిమానాలు భారీమొత్తంలో బాదుడే ..బాదుడే !
కరోనా ప్రజలకు సంప్రదాయాలు నేర్పిన కానీ పాలకులకు ఎలా సొమ్ము చేసుకోవాలి అనే కకృతి బుద్ది మాత్రం నేర్పిందని ప్రజలు సర్వత్రా ఎద్దేవా !చేస్తున్నారు.వాహనాలపై ఒక్కడు ప్రయయించిన మూతికి గుడ్డ తప్పని సరినట !కారులో ఒక్కడే నడుపుకుంటూ పోతే ముతిగుడ్డ లేదని పోలీసులు 1000 జరిమానా వేస్తారట !చోద్యంగా లేదు .
వైద్యులు మాస్కులు గంటల తరబడి కట్టుకుంటే సైడ్ ఎఫెక్ట్ తో ఇతర వ్యాధులు విజృంభిస్తాయని ప్రచారమాధ్యమాలలో చెబుతున్నారు .జనసమూహాలు ,ఇతరులతో మాటాడే సమయాలలో మాస్కులు ధరించడం తప్పనిసరి అంటున్నారు వైద్యులు . కేంద్రం కరోనా భరోసా నిధులు 20 వేల లక్షల కోట్లను కేంద్రం స్వీయ నియంత్రణలో కేటాయింపులు కావడంతో రాష్ట్ర ముఖ్య మంత్రులు ఆ నిధులు నగదుతో రాష్ట్రాలకు కేటాయిస్తే బాగుండేది అని ఎం కేటాయింపులు నా బొంద బొకి అని విమర్శలు చేయడం గమనార్హం .
ప్రజలారా ..పాలకుల బుద్దిని పసిగట్టండి ..ప్రగతి పట్ల వారికున్న చిత్త శుద్ధిని ఎండకట్టండి …!

 

మీ
సకినాల సుధాకర్
ప్రజా పక్షపాతి

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close