బ్రేకింగ్ న్యూస్: రాహూల్ గాంధీ అరెస్ట్

0
346
Rahul Gandi arrested in Madhya pradesh
Rahul Gandi arrested in Madhya pradesh
    కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీని మద్యప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులు అరెస్ట్ చేసారు. దీనితో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మండ్సోర్ లో పోలీస్ కాల్పుల్లో చనిపోయిన రైతు కుటుంబాలను పరామర్శించడానికి వెళ్ళిన ఆయనను మార్గ మధ్యలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనితో కాంగ్రేస్ కార్యకర్తలకి, పోలీసులకి మధ్య వాగ్వాదం జరిగింది.
    రైతులకి రుణ మాఫీ , పంటలకి గిట్టుబాటు ధర అడిగిన రైతులను విచక్షణ రహితంగా కాల్చి చంపడంతో విపక్షాలు ఆందోళనలు మొదలు పెట్టాయి. రైతుల మరణాన్నికి భాధ్యత వహిస్తూ మధ్యప్రదేశ్ మఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాజీనామ చేయాల్సిందిగా ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు.
    మండ్సోర్ , దేవాస్ జిల్లాల బంద్ కు పిలుపునిచ్చారు రైతులు. మండ్సోర్ టోల్ ప్లాజా పై దాడి చేసి, కంప్యూటర్ లు, ఇతర సామాగ్రికి నిప్పు పెట్టారు. అలాగే ఈ ఆగ్రహ జ్వాలలు ఇతర జిల్లాలకు కూడ వ్యాపించాయి. దీనితో దేవాస్, నిముచ్, ఉజ్జయిని, థార్, ఖర్గోన్ జిల్లాలలో పరిస్థితి ఆందోళనగా మారింది. పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టి మోబైల్, ఇంటర్నెట్ సేవలను నిలిపివేసారు.
    మద్యప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలు ఎక్కువ అవుతుండటంతో చనిపోయిన ఒక్కో రైతు కుటుంబానికి కోటి రూపాయల నష్ట పరిహారాన్ని ప్రకటించింది. అలాగే ఘటనకు భాద్యులైన కలెక్టర్, ఎస్పీ లను బదిలీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఆరు లక్షల మంది రైతులకు చెందిన 6వేల కోట్ల రుణమాఫికి సంబంధించి రుణ పరిష్కార పథకం ప్రకటించింది మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. అలాగే రైతులు చనిపోయిన ఘటనపై విచారణకి ఆదేశాలు జారీ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here