ఆధార్‌ కథల పోటీ…

0
412
aadhar competition
aadhar competition
  ప్రతి దాన్ని ఆధార్ తో లింక్ పెట్టడం వల్ల ఆధార్‌ పై ఎన్నో జోకులు, కథలు రాస్తున్నారు. ఇప్పుడు అవే జోకులు, కథలతో ప్రైజ్ మనీ గెలుచుకునే అవకాశం ఇచ్చింది కేంద్రం. ఆధార్ తో మీకున్న అనుభవాలు రాస్తే రూ.50,000 వరకు నజరానాతో ఆధార్‌ కథల పోటీ నిర్వహిస్తోంది. ఈ పోటీలో పాల్గొనాలంటే ఆధార్‌ నంబరు బ్యాంకు ఖాతాతో లింక్‌ అయి ఉండాలి. ‘ఆధార్‌ హై తో ఆసానీ హై’ పేరిట సోమవారం (జూలై- 10) ప్రారంభమైన పోటీ వివరాలను UIDAI ట్విటర్‌లో తెలిపింది. పోటీదారులు ఆధార్‌కు సంబంధించిన కథలు, అనుభవాలు రాసి పంపాలి.
  ఇవీ నిబంధనలు:
  .. కనీసం 200 నుంచి 500 పదాలలోపు ఉండాలి.
  .. హిందీ, ఇంగ్లిషు భాషల్లో రాయాలి.
  .. మైక్రోసాఫ్ట్‌ వర్డ్‌, పీడీఎఫ్‌, బ్లాగ్‌ లింక్‌ ఫార్మాట్‌లో ఆన్‌లైన్‌లోనే పంపాలి.
  .. కథలు పంపడానికి ఆగస్టు 8 అర్ధరాత్రి వరకు గడవు ఉంది.
  .. ఫలితాలు సెప్టెంబరు 7న ప్రకటిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here