ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర మహిళలను తన బిడ్డలుగా చూసుకోవాల్సిన కేసీఆర్ మహిళలను కుక్కలతో పోల్చడం ఆయన అహంకారానికి నిదర్శనం. దీనిని బీజేపీ మహిళ మోర్చా కార్యవర్గ సభ్యురాలు శ్రీ సోమారపు లావణ్య అరుణ్ కుమార్ గారు మహిళల తరుపున తీవ్రంగా ఖండించి కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది,అలాగే కేసీఆర్ నీ కూతురు,నీ భార్య కూడా మహిళలే అని నువ్వు మర్చిపోవద్దు.మహిళే లేక పోతే నీకు జన్మ కూడా లేదనే విషయం నువ్వు గుర్తుంచుకోవాలి.తెలంగాణ రాష్టంలో మహిళలకు రక్షణ లేకుండా పోతున్న ఈ సమయంలో కేసీఆర్ ధనార్జనే ధ్యేయంగా మరిన్ని బార్ లైసెన్స్ లు ఇవ్వడాన్ని తీవ్రంగా కండిస్తున్నాం.దీని వలన మహిళలపై దాడులు మరిన్ని పెరిగే అవకాశాలు లేక పోలేదు. నీ కూతురు కి అధికారం లేక పోతే తిరిగి ఎమ్మెల్సీ గా అధికారాన్ని ఇచ్చిన నువ్వు ఈ రాష్టంలో ఎంతో మంది యువతులు, మహిళలు ఉద్యోగాలు లేక ఎన్నో ఇబ్బందులు పడుతుంటే కనీసం నోటిఫికేషన్ కూడా వేయడం లేదు. ఇదే మహిళలు రానున్న ఎన్నికల్లో నీకు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని మహిళ మోర్చా తరుపున హెచ్చరిస్తున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి జాతీయ నాయకురాలు, బి.ఈ. ఎం.ఎల్ డైరెక్టర్ బల్మూరి వనిత గారు మాట్లాడుతూ కె.సి ఆర్ అహంకారానికి త్వరలోనే రాష్ట్ర ప్రజానీకం బుద్ది చెప్తారని అన్నారు, ఈ కార్యక్రమంలో బిజెపి నాయకురాళ్లు ఆరె దేవకర్ణ ,లక్ష్మి, అనిత, సాయి లత, భాగ్య మరియు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.