ఘనంగా సింగపూర్ సంస్కృతోత్సవాలు

0
104

ఆదివారం రోజున ఆర్య సమాజ్ హాల్ లో అంతర్జాతీయ నృత్యం మరియు గానం పోటీలు ప్రాడ్ పిటిఇ ప్రైవేట్ ఆద్వర్యంలో, కల్చరల్ ఫైన్ ఆర్ట్స్ మరియు మలేషియా తెలుగు సమాజం తో కలిసి ఘనంగా జరిపారు .ఈ పోటీలకు ఇండియా నుండి 45 మంది సభ్యులు, సింగపూర్ నుండి 50 మంది సభ్యులు, మలేషియా నుండి 40 మంది సభ్యులు పాల్గోన్నారు, అనంతరం ప్రథమ ద్వితీయ బహుమతులను డాక్టర్ వేదాంతం రాధేష్యం గారి చెతులమీదుగా ప్రదానం చెయడం జరిగినది . ఇండియా కి ఛాంపియన్‌షిప్ అవార్డు రావాడం కొసమెరుపు .
కార్యక్రమం లో ప్రాడ్ పిటిఇ ప్రైవేట్ సీఈఓ మిర్యాల సునీతారెడ్డి మాట్లాడుతూ నృత్యం మరియు గానం పోటీలను అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించడం చాల ఆనందంగా వుంది అని మాట్లాడినారు , ఇలాంటి పోటీలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మలేషియా తెలుగు సమాజం ప్రెసిడెంట్ R.కాంతారావు అక్కునాయుడు, మరియు భారత నాట్యం డాన్స్ టీచర్ Ms లక్ష్మి గారు పాల్గున్నారు , కాంతారావు మాట్లాడుతూ తమ సమాజం నుండి అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శన ఇవ్వడం ఇదే మొదటిసారి అని చెప్పినారు , ఇక ముందు కూడా ప్రతి సంవత్సరం పాల్గునటం అని చెప్పినారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here