మాజీ ఎమ్మెల్యే భూమికే ఎసరు పెట్టిన కబ్జాదారులు

88 0

మాజీ ఎమ్మెల్యే భూమికే ఎసరు పెట్టిన కబ్జాదారులు

చట్ట సభలో అడుగుపెట్టిన వ్యక్తి ,ఉన్నత విద్యావంతుడు ,వున్నోతోద్యోగిగా పదవీవిరమణ పొందిన వ్యక్తి వ్యవసాయ భూమినే భూకబ్జా దారులు కన్నేసి చొరబడుతున్నారు .
బరితెగించి బెదిరింపులకు పాల్పడుతున్నారు .చట్టం తెలిసిన వారి భూమినే కబ్జా చేస్తే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటో ఈ పాలకులు జవాబు చెప్పాల్సివుంది .
వివరాల్లోకి వెళితే !
అయన పేరు సాన మారుతిగతంలో కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం శాసనసభ్యుడిగా పనిచేసారు .ఇరిగేషన్ శాఖలో చీఫ్ ఇంజనీరుగా పని చేసి రిటైర్ అయ్యారు .1971 సంవత్సరంలో కరీంనగర్ పట్టణంలోని బొమ్మకల్ ప్రాంతంలో సర్వే నెంబర్ 723 , 724 లో ఏడు ఎకరాల వ్యవసాయ భూమిని వెలిచల తిరుపతిరావు ( అయితపల్లి తిరుపతి రావు ) నుండి కొనుగోలు చేశారు . ఈ పట్టా భూమిని రెవెన్యూ చట్టాలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ తో పాటు ముటేషన్ చేయించుకున్నారు . అప్పడి నుండి ఇప్పటి వరకు రెవెన్యూ రికార్డులో ఈ భూమి తన భార్య సానా లక్ష్మి పేరు మీద ఉంది . 18 సంవత్సరాల క్రితం అంటే 2003 లో వ్యక్తిగత అవసరాల రీత్యా మూడు ఎకరాల భూమిని బుర్ర నర్సయ్య అనే వ్యక్తికి విక్రయించారు .ఈ మూడు ఎకరాల భూమి పోగా మిగతా భూమి సాన భార్య పేరు మీదనే ఉంది . ఈ భూమికి సంబంధించిన హద్దులతో సహా పాస్ బుక్ , టైటిల్ డీడ్ వంటి వివరాలు ధరణి పోర్టల్ లో కూడా నా భార్య పేరు మీదనే ఉన్నాయి.50 సం వత్సరాలకు పైగా (1971 నుండి ) నేటి వరకు పొజిషన్లో కూడా నేనే ఉన్నాను . ఈ భూమికి కాంపౌండ్ వాల్ కూడా ఉంది. ఇదే బొమ్మకల్ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే నలమాచం కొండయ్య సర్వేనెంబర్ 724 లొ నాలుగు ఎకరాల 20 గుంటల స్మశాన భూమి ఉన్నట్టు పహాణి లో ఉంది . ఈ సర్వే నెంబర్ తో స్మశానంలో తప్ప వేరే ఎక్కడ నలమాసు కొండయ్యకు భూమి లేదు . ఈయన జీవిత కాలంలో తనకు సర్వే నెంబర్ 724 లో ఎక్కడ భూమి ఉన్నట్లు చెప్పలేదు . ఈ భూమి కోసం ప్రయత్నం కూడా చేయలేదు . సర్వేనెంబర్ 724 లో నలమాసు కొండయ్య భూమి ఉన్నట్లు టైటిల్ గాని , పొజిషన్ గానీ ఎక్కడా లేదు . 1976 సంవత్సరంలో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ రావడంతో నలమాసు కొండయ్య పేరు మీద ఒక ఎకరం 30 సెంట్లు మిగులు భూమి ఉందని అప్పటి ఆర్డీవో గారు నిర్ధారణ చేశారు . 1986 వ సంవత్సరంలో ప్రభుత్వం బొమ్మకల్ గ్రామంలో బలహీనవర్గాల కోసం భూమి కేటాయించింది . దీనికోసం నలమాసు కొండయ్య మిగులు భూమిని గుర్తించమని ప్రభుత్వం చెప్పింది . దీంతో రెవెన్యూ అధికారులు పొరపాటున భుమ్మి నా భార్య పేరు మీద సర్వే నెంబర్ 724 లో ఉన్న భూమిని సుమోటోగా తీసుకొని మిగులు భూమిగా బావించి బలహీనవర్గాలకు కేటాయించారు . అప్పుడు తాను ఉద్యోగరీత్యా
నిజామాబాద్ జిల్లా లో పని చేస్తుండే వాడిని ఈ విషయము నా నోటీసుకు రావడంతో వెంటనే జిల్లా కలెక్టర్ ను కలుసుకొని మా భూమికి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లను ఇవ్వటం జరిగింది. అదేవిధంగా భూసంస్కరణలకు సంబందించిన ఆర్డీవోకు పిటిషన్ కూడా ఇచ్చారు .ఇచ్చిన దరఖాస్తుపై విచారణ జరిపిన సంబంధిత అధికారులు ఈ విషయంలో తాము పొరపాటు చేశామని ఒప్పుకొని పట్టా భూమి సాన లక్ష్మి గారి దేనని రికార్డులు సవరించారు. దీనికి సంబంధించి నల్ల మాస కొండయ్య కూడా ప్రభుత్వ అధికారులు పొరపాటు చేశారని ప్రభుత్వం 723, 724 సర్వే నెంబర్లలో బలహీనవర్గాలకు కేటాయించిన భూమి అది పూర్తిగా సా న లక్ష్మీ గారి దేనని సర్వేనెంబర్ 723, 724 లో ఉన్న భూమి కి తనకు ఎటువంటి సంబంధం లేదని కోర్టులో అఫిడవిట్ సమర్పించడం జరిగింది .ఈ విషయం పై మేము హైకోర్టు ను ఆశ్రయించడం జరిగింది విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం 723,724 సర్వేనెంబర్ లో ఉన్న భూమిపై పూర్తి హక్కులు సాన లక్ష్మి చెంది ఉంటాయని తీర్పు ఇవ్వడం జరిగింది.ఈ భూమిపై పై దివంగత మాజీ ఎమ్మెల్యే నల మాసు కొండయ్య కు అతని కుటుంబ సభ్యుల గాని ఎటువంటి హక్కులు లేవు. ప్రస్తుతము కరీంనగర్ పట్టణంలో భూములకు ధర పెరుగుతుండటంతో లాండ్ మాఫియా కన్ను మా భూమి పై పడింది విలువైన మా భూమి ని ఎలాగైనా నా కబ్జా చేసుకోవాలని దురుద్దేశంతో కొంతమంది కబ్జా రాయుళ్లు ప్రయత్నం చేస్తున్నారు. 2009వ సంవత్సరంలో లో మరణించిన నల్ల మాస కొండయ్య కుటుంబసభ్యులను ప్రలోభపెట్టి ధనాశ చూపించి ఎలాగైనా నా భూమిని కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అతను అయన భార్య అనారోగ్యం కారణంగా హైదరాబాదులో ఉండటంవల్ల కబ్జాదారులు పెట్రేగి పోతున్నారు. ఆ భూమికి కాపలాదారు గా ఉన్న వ్యక్తులను అనేక రకాలుగా వేధించడమే కాకుండా నన్ను మా కుటుంబ సభ్యులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. నేను ఒక ఉన్నతాధికారిగా రిటైర్డ్ అవడమే కాకుండా మాజీ శాసనసభ్యుడు అని తెలిసి కూడా వారు కనీస మర్యాద పాటించకుండా వారు అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ మమ్ములను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ విషయమై కరీంనగర్ జిల్లా కలెక్టర్ కు ,పోలీస్ కమిషనర్ సంబంధిత అధికారుల ను కలిసి తమకు రక్షణ కల్పించడంతోపాటు తమ భూమి కబ్జా గురికాకుండా చూడవలసిందిగా ఫిర్యాదు చేయడం జరిగింది. దయచేసి ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు పెద్ద మనసుతో జోక్యం చేసుకొని మమ్ములను భయభ్రాంతులకు గురిచేస్తున్న లాండ్ మాఫియా మీద వెంటనే
కఠిన చర్యలు తీసుకోవాలని సాన మారుతీ విజ్ఞప్తి చేశారు .

Report by
Sakainala sudhakar Patel
Senior journalist

పట్టాదారు సాన లక్ష్మి
భర్త :/సాన మారుతి
మాజీ ఎమ్మెల్యే,చొప్పదండి
చీఫ్ ఇంజనీర్ ఇరిగేషన్ (రిటైర్డ్)
మొబైల్ 9949433253

Related Post

వివేకానందనగర్ సమస్యల గురించి జోనల్ కమిషినర్ ని కలిసిన కార్పొరేటర్ లక్ష్మి భాయి

  122 డివిజన్ వివేకానందనగర్ లోని పలు సమస్యలపై  జోనల్ కమీషనర్ మమత ని కలిసి డివిజన్ అభివృద్ధికి ఫండ్స్ రిలీస్ చేసి దాని ద్వార డివిజన్…

బీసీలకే మేయర్ పదవి ఇవ్వాలి – డాక్టర్ పర్వతం వెంకటేశ్వర్

ఎన్నికల పూర్తి కావడంతో ఇప్పుడు అన్ని పార్టీల్లో మేయర్ ఎవరన్నది చర్చ మొదలయ్యింది.జనరల్ మహిళకు మేయర్ పీఠం రిజర్వ్ కావడంతో ఆయా పార్టీల్లో ఉన్న నేతలు తమ…

బండి సంజయ్ కి భగవద్గీతను బహుకరించిన తెలంగాణ బేటీ బచావో కన్వీనర్

Posted by - May 21, 2020 0
  ఈ రోజు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మరియు పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ గారిని తెలంగాణ బీజేపీ బేటీ బచావో బేటీ పడావో…

సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం : కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి

Posted by - September 18, 2020 0
చైతన్యపురి డివిజన్ సాయి నగర్ కాలనీ కి చెందిన తిరుమలయ్య కి సీఎం సహయ నిధి నుంచి మంజూరైన రూ, 60,000 /చెక్కు ని ఎల్.బి .నగర్…

మంజీర మెట్రో ట్రాన్స్ మిషన్ ఫేస్ 2 పైప్ లైన్ పనులు త్వరగా పూర్తి చేయండి

Posted by - September 16, 2020 0
చందానగర్ డివిజన్ దీప్తిశ్రీ నగర్ (మదీనగూడ) వద్ద అర్ధరాత్రి మంజీర మెట్రో ట్రాన్స్మిషన్ ఫేస్ 2 పైప్ లైన్ ఆకస్మికంగా పగిలిపోవటం తో మహాలక్ష్మి ఆర్కేడ్, స్పెన్సర్స్…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *