ఢిల్లీలో కూడ చిరూనే నెం.1

0
323
chiru is no1 voter in president elections
chiru is no1 voter in president elections
    సిని రంగం , రాజకీయ రంగం ఇలా ఏదైన తనకి దాసోహమే. అతి తక్కువ కాలంలోనే చలన చిత్రపరిశ్రమలో నెంబర్ వన్ స్థానాన్ని సాధించి, అనూహ్యంగా రాజకీయాలలో ప్రవేశించి ఒక కొత్త రాజకీయ పార్టీ స్థాపించి తెలుగు ప్రజల నాయకుడిగా పేరుతెచ్చుకున్న మన మెగాస్టార్ చిరంజీవి గారు ఢిల్లీ రాజకీయాలలో కూడ తానేంటో నిరూపించుకున్నాడు.

    కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా నియమితుడైన కె. చిరంజీవి గారు ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికలలో తొలి ఓటరుగా పేరు నమోదు చేసుకున్నాడు. దీనితో రాష్ట్రపతి ఎన్నికలో తొలి ఓటరుగా దేశ రాజకీయ ప్రస్థానంలో చిరు పేరు సాధించుకున్నాడు. అలాగే మన తెలుగు రాష్ట్రాన్నికి చెందిన మల్లాడి కృష్ణారావు గారు చివరి(4896) ఓటరుగా పేరు నమోదయింది.

    ఈ ప్రక్రియకు సంభందించిన పూర్తి వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసే హక్కున్న సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ జాబితాని కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here