ప్రశ్నించటానికి వస్తున్న చిరంజీవి?

0
4508

తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయాక పవర్ స్టార్ కళ్యాణ్ సీమాంధ్ర సమస్యలన గురుంచి అధికార పక్షాలను ప్రశ్నించటానికి జనసేన పెట్టాడు. కాంగ్రెస్ ని ,వైస్సార్ పార్టీలను మళ్ళి అధికారంలోకి రాకుండా చేయటంలో అయ్యాడు. ఐతే ఇపుడు మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రశ్నించబోతున్నాడు.ఏంటి చిరు కాంగ్రెస్ ని వదలి తమ్ముడితో కలిసిపోతున్నాడు అనుకుంటున్నారా?
కానీ అయన ప్రశ్నించేది నాయకులను కాదు ప్రజలను. అవును తెలుగులో నాగార్జున మీలో ఎవరు కోటీశ్వరుడు తో ప్రేక్షకులను ప్రశ్నలు అడిగి చాల మంది జీవితాలు బాగుపడేలా చేసాడు,నిజానికి ఇప్పటివరకు తెలుగులో వచ్చిన భారీ గేమ్ షో ఇదే. హిందీలో అమితాబ్ చేయటంతో ఆ స్థాయిని అందుకుంటాడా అని చాల మంది సందేహపడ్డారు కానీ అందరి సందేహాలను పటాపంచెలు చేస్తూ నాగ్ సక్సెస్ అయ్యాడు. ఒక విదంగా చెప్పాలంటే ఆ షో కి నాగ్ ఒక ట్రెండ్ సెట్ చేశాడు.
ఐతే ఇపుడు ఆ షో ని చిరుతో చేయించాలని మా టీవీ వాళ్ళు అనుకుంటున్నారు. రాబోయే 4వ సీజన్లో ఆయన్ని హోస్ట్ గా పెట్టాలని అనుకుంటున్నారు. చిరు కూడా ఆ షోకి వన్నె తెస్తాడని భావిద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here