ఆ విషయంలో తండ్రిని అనుసరిస్తున్న హీరో

0
863

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అపుడపుడు నటన లో చిరుని అనుసరిస్తాడు. చిన్నప్పటి నుంచి అయన డాన్సులు , నటన చూసి పెరిగాను కాబట్టి అపుడపుడు తనకు తెలియకుండానే కొన్ని హావభావాలు వస్తుంటాయని గతంలో ఒక ఇంటర్వ్యూలో చరణ్ ఓపెన్ అయిపోయాడు కూడా. కాని ఆఫ్ ది స్క్రీన్ లో కూడా చిరుని ఫాలో అవుతున్నాడని స్పష్టంగా తెలుస్తుంది. నిజానికి చిరంజీవి ఏళ్ల తరపడి నెంబర్ 1 స్థానాన్ని ఏలడంటే కేవలం తన ప్రతిభ ,స్వయంకృషి,కష్టపడేతత్వం మాత్రమే కాదు. అందరితో కలిసిపోయే గుణం కూడా ఒకటి. తెలుగులో ఏ హీరో కూడా హిట్ కొట్టిన కూడా మొదటి ప్రశంస చిరంజీవి నుంచే ఉండేది. బాలకృష్ణ ,వెంకటేష్ ,నాగార్జున,మోహన్ బాబు ల సినిమా ప్రారంబోత్సవాలకు,శతదినోత్సవాలకు చిరు పక్కాగా ఉండేవాడు. ఆదిత్య 369 సినిమాకు ప్రచార చిత్రాన్ని చిరంజీవి,విజయశాంతిలతో చేయించామని ,అది ఆ సినిమాకు మంచి బూస్ట్ ఇచ్చిందని సినిమా నిర్మాత శివలంక కృష్ణ ప్రసాద్ ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు. మహేష్ బాబు కి స్టార్ట్ ఇమేజ్ తెచ్చిన అతడు సినిమా హిట్ అయినపుడు తెలుగు సత్తా ని చాటవని మహేష్ కి ఫోన్ చేసిన సంగతి ఆయనే స్వయంగా చెప్పాడు.

ఇపుడు ఆ పాత్రని అయన తనయుడు రామ్ చరణ్ తీసుకున్నట్లు కనిపిస్తుంది. ఈగ సినిమాకు అయన బాగా ప్రమోట్ చేసాడు. గత ఏడాది విడుదలైన శ్రీమంతుడు సినిమా హిట్ అయితే తెలుగు హీరోలు ఒక్కరు కూడా మహేష్ కి ఫోన్ చేయలేదట. కేవలం రామ్ చరణ్ మాత్రేమే విష్ చేసాడట. ఈ విషయాన్నీ మహేష్ స్వయంగా చెప్పాడు. నిన్న మహేష్ పుట్టిన రోజు సందర్బంగా చరణ్ ఫేస్బుక్ పేజీ లో విష్ చేసాడు. విచిత్రంగా ఆయన్ని విష్ చేసిన స్టార్ హీరో చరణ్ మాత్రమే. గతంలో జయప్రద షో లో కూడా చరణ్ మహేష్ ని పొగిడాడు. హిపోక్రసీ,ఇగోలతో నిండిపోయిన సినిమా ఇండస్ట్రీ లో చరణ్ తన మార్కుతో తుడిపేయటం అభినందనీయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here