భారతీయలకు నచ్చని చైనా…. బాబుకి ఎందుకు నచ్చుతుందో?

0
636

భారతీయలు ఒకవైపు….. చంద్రుడు ఒక వైపు …. మహేష్ బాబు ఒక సినిమాలో ఇలాంటి అర్థం వచ్చే పాట ఒకటి పాడుకుంటాడు. ఆంధ్ర సి.ఎం చంద్ర బాబు కూడా పాడుకుంటాడో లేదో కానీ చంద్ర బాబు గురుంచి మాత్రం ఆంధ్రులు పాడుకుంటున్నారు. ఎందుకంటే ఈ మధ్య చంద్రబాబు తీరు,వ్యాఖ్యలు వివాదస్పదంగా మారిపోతున్నాయి. అసలు విషయానికొస్తే గత కొన్ని రోజులుగా భారతీయులకు చైనా అంటే మండిపోతున్నారు ఎందుకంటే NSG (అణు సరఫరా గ్రూప్ ) లో ఇండియా ని రాకుండా అడ్డుపడి దానిలో భాగంగా పాకిస్తాన్ ని పిక్చర్ లోకి తెచ్చింది. ఈ పరిణామంతో ఒక్కసారిగా ఇండియా లో చైనా వస్తువులు బ్యాన్ చేయాలనే డిమాండ్ ,స్పృహ ఎక్కువయింది.

ఇదిలా ఉంటే వీటికి విరుద్దంగా చంద్ర బాబు వ్యవహరిస్తున్నాడు. మొన్నటికి మొన్న చైనా పర్యటనకి వెళ్లి,అక్కడి వ్యాపారవేత్తలతో భేటీ అయ్యి అమరావతి లో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాడు. చైనా కంపెనీ ల వ్యవహారంలో కూడా ఆయన విమర్శల పాలు అవుతున్నాడు ఉదాహరణకు ANSTEEL అనే స్టీల్ కంపెనీ ఏర్పాటు చేయనున్నారని ప్రకటించారు. కానీ ఆ కంపెనీ ఒక వివాదాస్పదమైన కంపెనీ గా ఆంధ్ర మేధావులు బాబుని విమర్శిస్తున్నారు. భారతీయలు చైనాలో తయారయ్యే వస్తువులను స్వచ్చందంగా బ్యాన్ చేస్తే బాబు మాత్రం ఆ వస్తువులను అమరావతిలో తయారుచేసుకునే వీలు ఇస్తున్నాడు. ఏదిఏమైనా బాబు వ్యవహారం దేశ ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా లేదని అనిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here