బాబు ని నిలబెట్టిన ఐటి ఇపుడు పడగొడుతుందా?

0
190

భస్మాసురుడు అంటే పురాణాల్లో ఒక ప్రత్యేక వ్యక్తిత్వం. ఎంతో కష్టపడి శివుడి దగ్గర తీసుకున్న వరం చివరికి తనకు శాపంగా మారి తన చేయిని తన తల మీద పెట్టుకొని బూడిద అవుతాడు. ఇపుడు చంద్రబాబు ను చూస్తుంటే ఇప్పటి వరకు తనకు వరంలా మారిన ఐటీ ,టెక్నాలజీ ,సాఫ్ట్ వెర్ రంగాలు ఇపుడు శాపంలా మారి తన మెడకు చుట్టుకొని తన అధికారానికి ఎసరు వచ్చే ప్రమాదాన్ని చవిచూస్తున్నాడు.

అసలు విషయానికొస్తే 1999 ప్రాంతంలో బాబు అంటే ఐటి ,ఐటి అంటే బాబు అనే విదంగా చెప్పుకునే వారు,వాస్తవాలు ఎలా ఉన్న అయన పోషించే మీడియా మాత్రం బిల్ గేట్స్ కి బాబు గారే ఐటి పాఠాలు చెప్పాయి అనే విదంగా ఆకాశానికెత్తాయి. ఆ రోజుల్లో బాబు గారు లాప్ టాప్ లతో కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ పెట్టితే ఆంధ్ర దేశం ఫీదా అయి 1999 ఎన్నికల్లో ఆయనకు ప్రజలు పట్టం కట్టారు (ఆ గెలుపులో బీజేపీతో పొత్తు కూడా భాగమైంది ). కాని ఇపుడు అదే ఐటి బాబుకి శాపంగా మారింది.

ఇటీవల డేటా గ్రిడ్స్ కంపెనీ చేసిన డేటా స్కామ్ లో ఆంధ్రలో ఉన్న టీడీపీ వ్యతిరేఖ ఓట్లను తొలగించటానికి ఆధార్ డాటాను అక్రమంగా ఉపయోగించారనే ఆరోపణలతో తెలంగాణ లో ఆ కంపెనీ మీద కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఐతే ఆ విషయం బయటపడటంతో టీడీపీ పార్టీ ఇమేజ్ మొత్తం డామేజ్ అయింది. టెక్నాలజీని నమ్ముకున్న బాబు అదే టెక్నాలజీ సహాయంతో మళ్ళి అధికారాన్ని చేజిక్కించుకుందాం అనుకున్న ఆయనకు దేశవ్యాప్తంగా పరువు పోయింది. ఆలా తనకున్న వరాన్ని దుర్వినియోగం చేసుకొని తన తల మీదే తన చేయి పెట్టుకొని భస్మాసుడిలా మారిపోయాడని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here