గుర్రం ఐడియా బాగుంది కాని….. వేగమే?

0
744

80 వ దశకంలో ఒక అబ్బాయి ఇద్దరినీ పెళ్లి చేసుకుంటే లేక ఇద్దరినీ ప్రేమిస్తే వచ్చే బాధలను సినిమాల్లో చూసాం. 90 వ దశకంలో ఇద్దరు అబ్బాయిలు ఒకే అమ్మాయిని ప్రేమిస్తే ప్రేమదేశం సినిమాలో చూసాం. తర్వాత దశకంలో ఇద్దరు ఒకే రూంని కిరాయికి తీసుకుంటే వచ్చే వినోదాన్ని చూసాం. ఈ దశకంలో ఒక యువకుడు రెండు కంపెనీల్లో ఒకే సారి ఉద్యోగం చేస్తే ఎలా ఉంటుందో అని చల్ చల్ గుర్రం సినిమాలో చూపించాడు దర్శకుడు. మరి పాత సినిమాల్లాగే ఇది కూడా ప్రేక్షకులు ఆదరిస్తారో లేక తిరస్కరిస్తారో చూడాలి.

కథ
మనోహర్ (శైలేంద్ర) ప్రతిభ గల సాఫ్ట్‌వేర్ఉద్యోగి. అవసరనిమిత్తం మనోహర్ ఒకేసారి రెండు కంపనీల్లో జాబ్ చేస్తుంటాడు. ఒక కంపెనీలో డే షిఫ్ట్ లో చేస్తుంటే మరోదానిలో నైట్ షిఫ్ట్ లో చేస్తుంటాడు. ఈ క్రమంలో మనోహర్ ఎదుర్కునే సమస్యలు,వాటి వల్ల వచ్చే కామెడీని ,కథలో ఉండే రొమాన్సుని సినిమాలో చూడాల్సిందే.

విశ్లేషణ

వినటానికి కొత్తగా ,ఉత్సాహంగా అనిపించే కథ బాగున్నా అనుకున్న విదంగా దర్శకుడు ప్రెజెంట్ చేయలేకపోయాడనే చెప్పొచ్చు. ఒక ఐడియాని తీసుకొని దాన్ని సినిమాగా మార్చాలంటే పెద్ద వంశీ,ఏలేటి చంద్రశేఖర్ లాంటి వలనే అవుతుందని చెప్పొచ్చు. ఔను వాళ్లిదరు ఇష్టపడ్డారు సినిమాలో ఒకే ఇంట్లో హీరో హీరోహీన్లు ఒకరికి ఒకరు తెలియకుండా డే,నైట్ షిఫ్టులలో ఉండటం అనేది సాహసోపేతమైన ప్రయోగం. ఆ ప్రయోగాన్ని వంశీ మార్క్ కామెడీ తో పూరించాడు అని చెప్పొచ్చు. మారుతి తీసిన భలే భలే మగాడివోయ్ సినిమా కూడా చిన్న ఐడియా తో సినిమాను అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా నడిపించాడు. కానీ మోహన్ మాత్రం తడపడ్డాడు. ఫ్లాష్ బ్యాక్ బాగుంది ,హీరో శైలేంద్ర స్క్రీన్ ప్రెసెన్స్ బాగుంది . ఈయనకు మంచి కథ దొరికితే ఇండస్ట్రీలో సెట్ కావొచ్చు. రెండు కంపెనీల్లో సమయంలో కామెడీ బాగుంది. నాగబాబు తన డైలాగులతో అలరించాడు. హీరోహీన్ల పాత్రలు కేవలం అందాల ప్రదర్శకే పరిమితం. సినిమాటోగ్రఫీ , నిర్మాణ విలువలు బాగున్నాయి.చల్ చల్ గుర్రం టైటిల్ సాంగ్ తప్ప సంగీతంలో కొత్తదనం లేదు. చివరకు మంచి ఐడియా ను టైట్ స్క్రిప్ట్ తో తెరకెక్కిస్తే ఇంకా బాగుండేది.
తీర్పు :గుర్రానికి కథ ఉంది… కాని వేగమే లేదు.
రేటింగ్ :2.5/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here