తెలంగాణ జాగృతి,క్యాట్ ఆధ్వర్యంలో జాగృతి క్రికెట్ కప్

0
454

తెలంగాణ గ్రామీణ క్రికెట్ కి సేవలు అందిస్తున్న క్యాట్ కి ఇపుడు తెలంగాణ జాగృతి తోడయ్యింది. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో వచ్చే నెల 7 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న జాగృతి కప్ కి క్రికెట్ అసోసియేషన్ అఫ్ తెలంగాణ క్యాట్ టెక్నికల్ సపోర్ట్ ఇవ్వనుంది. భారీ ఎత్తున జరగనున్న ఈ టోర్నమెంట్ ఏ నెల 23 న లాల్ బహుదూర్ స్టేడియంలో ఫైనల్ భారీ ఎత్తున జరగనుంది. ఈ రోజు బంజారాహిల్స్ జాగృతి కార్యాలయంలో ఎంపీ కవిత తో సమావేశమైన క్యాట్ ఫౌండర్ ,జనరల్ సెక్రెటరీ సునీల్ బాబు కొలనుపాక టోర్నమెంట్ విధివిధానాలు ,కార్యాచరణాల గురుంచి మాట్లాడారు. ఈ టోర్నమెంట్ రికార్డు సృష్టిస్తుందని సునీల్ బాబు చెప్పారు. ఈ కార్యక్రమంలో క్యాట్ జిల్లా కోఆర్డినేటర్లు రవీందర్ ర్యాడ(నిజామాబాద్),మింగిని అశోక్ (కరీంనగర్),సందీప్(హైదరాబాద్ ),భూక్యా సురేష్ (ఆదిలాబాద్),శ్రీకాంత్(కామారెడ్డి) లు పాల్గొన్నారు. మిగతా వివరాలు రానున్న రెండు రోజుల్లో వెలువడనున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here