సినారె కన్నుమూత…

0
510
c narayana reddy
c narayana reddy
    తెలుగు సాహితి రంగంలో ఎన్నో రచనలు, కవితలు, కథలు రాసిన జ్ఞాన్ పీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడిన ఆయన కొద్దిసేపటి కింద హైద్రాబాద్ కేర్ హాస్పిటల్ లో కన్నుమూశారు. 1931 జులై 29న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హన్మాజీపేటలో పుట్టారు సింగిరెడ్డి నారాయణరెడ్డి.
    /ul>

      1988లో విశ్వంభర కావ్యానికి సినారెకు జ్ఞాన్ పీఠ్ అవార్డు వరించింది.విశ్వనాధ సత్యనారాయణ తరువాత జ్ఞానపీఠ పురస్కారం పొందిన తెలుగు సాహీతీకారుడు ఆయనే. రాజ్యసభ సభ్యునిగా కూడా నియమితుడయ్యారు. తెలుగు చలన చిత్ర రంగములో ఆయన రాసిన పాటలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. సికింద్రాబాదు లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో అధ్యాపకుడిగా చేరి అటు తర్వాత నిజాం కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయములో ఆచార్యునిగా పనిచేస్తూ అనేక ఉన్నత పదవులు, పురస్కారములు పొందారు. విద్యార్థి దశలోనే ప్రహ్లాద చరిత్ర, సీతాపహరణం వంటి పద్య నాటికలు, భలే శిష్యులు తదితర సాంఘిక నాటకాలు రచించాడు.

      సినారె గ్రంథాలు ఇంగ్లీషు, ఫ్రెంచ్, సంస్కృతం, హిందీ,మలయాళం, ఉర్దూ, కన్నడం మొదలైన భాషల్లోకి అనువాదమయ్యాయి. ఆయనే స్వయంగా హిందీ, ఉర్దూభాషల్లో కవితలల్లారు. అమెరికా, ఇంగ్లండు, ఫ్రాన్స్,రష్యా, జపాన్, కెనడా, ఇటలీ, డెన్మార్క్, థాయ్ ల్యాండ్,సింగపూర్, మలేషియా, మారిషస్, యుగోస్లోవియా,ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాలను సందర్శించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here