వంటగ్యాస్‌పై మరింత భారం…

0
301
burden on cooking gas
burden on cooking gas

వంటగ్యాస్‌పై మరింత భారం మోపనుంది కేంద్రప్రభుత్వం. ఇక నుంచి నెలవారీగా వంటగ్యాస్‌ ధరను పెంచనుంది. సబ్సీడీ గ్యాస్‌ సిలిండర్‌పై ప్రతి నెలా రూ.4 పెంచాలని ప్రభుత్వ రంగ ఇంధన సంస్థలను ఆదేశించినట్లు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ సోమవారం ( జూలై-31) తెలిపారు. ప్రస్తుతం సబ్సీడీ కింద ఏడాదికి 12 గ్యాస్‌ సిలిండర్లు తీసుకోవచ్చు. ఆ తర్వాత 13వ సిలిండర్‌ నుంచి మార్కెట్‌ రేటుకే విక్రయిస్తున్నారు. అయితే గతేడాది జులై 1 నుంచి సబ్సీడీ సిలిండర్‌పై ప్రతి నెలా రూ.2 (వ్యాట్‌ కాకుండా) పెంచుతూ వస్తున్నాయి ఆయిల్‌ కంపెనీలు. అయితే ఈ ఏడాది జూన్‌ 1 నుంచి నెలనెలా రూ. 4 పెంచాలని కంపెనీలను ఆదేశించినట్లు తెలిపారు ప్రదాన్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here