సోషల్ మీడియాలో మేయర్ బొంతు రామ్మోహన్ పై కుట్రలు

0
1396
GHMC Mayor Bontu Rammohan post morphing issue revealed
GHMC Mayor Bontu Rammohan post morphing issue revealed
    తెలంగాణ రాష్ట్ర గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ మేయర్ బొంతు రామ్మోహన్ పై సోషల్ మీడియాలో కొంత మంది కుట్రలకు పాల్పడుతున్నారు. ఈ మధ్య మేయర్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో అక్రమార్కుల కంటిలో నిద్రలేకుండ పోతుంది. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని అప్పటి నేతలకి చుక్కలు చూపించిన మేయర్, ఇప్పుడు అక్రమార్కులపై విరుచుకుపడుతున్నాడు.
    నిన్నటికి నిన్న అక్రమంగా నిర్మిస్తున్న భవనాన్ని కూల్చివేసి ప్రజలచే శభాష్ అనిపించుకున్న మేయర్ పై కొన్ని దృష్ట శక్తులు కుట్రలు చేస్తున్నాయి. మేయర్ గారు సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ లను కొంత మంది మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ వారి కుటిల బుద్దిని చూపెడుతున్నారు. ఈ మధ్య బొంతు రామ్మోహన్ గారు ఫేస్ బుక్ లో పెట్టిన ఒక పోస్ట్ ని మార్ఫింగ్ చేసి అసలు సమాచారాన్ని ప్రజలకి తెలియకుండా కుట్రలు పన్నారు. హైదరాబాద్ నగరాన్ని అందంగా తీర్చిదిద్దడానికి మంచి పద్దతులు ఎక్కడున్న వాటిని వినియోగించుకుందాం అని చెపితే దానిని వక్రీకరించి హైదరబాద్ మేయర్ గారి పైన ప్రజలలో అపనమ్మకాన్ని సృస్తిస్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయకుండ వారి అక్రమాలు బయటకి పొక్కకుండా వివిధ కుట్రలు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలని ప్రజలకి అందించెందుకు అహర్నిశలు శ్రమిస్తున్న మేయర్ బొంతు రామ్మోహన్ గారి పని తనం నచ్చని వారు చేస్తున్న వికృత చేస్టలు ప్రజలలో అపనమ్మకాన్ని కల్పిస్తున్నాయి. ప్రజా సమస్యల పరిస్కారానికి కృషి చేస్తున్న మేయర్ పై అలాంటి దృష్ప్ర చారం చెయడాన్ని ప్రజలు వ్యతిరేకిస్తూ దృష్ప్ర చారం చేస్తున్న వారిపై మండిపడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here