నల్ల బాబుల నయా గాలి మంత్రాలు…అవేంటో చదవండి…!

0
2412

నల్ల ధనికుల పని పట్టాలన్న బిజెపి ప్రభుత్వం ,రాత్రికి రాత్రి 500,1000 నోట్లను బ్యాన్ చేయటంతో ఒక్కసారిగా దేశం షాక్కి గురయ్యింది. చాల మంది హర్షిస్తే చాల మంది సామాన్యులు బాదలు పడుతున్నారు. నల్ల ధనికుల పని అవుతుందన్న సమయంలో వాళ్ళు కొత్త మంత్రాలు వల్లిస్తూ మొహానికి ఉన్న నల్ల రంగును తెల్లగా చేయటానికి శత ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవేంటో కింద చదవండి.

  • నల్లకుబేరులు విమానాశ్రయాల్లోని ఎయిర్ లైన్స్ కౌంటర్లను వాడుకొంటూ నల్లధనాన్ని చలామణిలోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అదేంటంటే ఇంట్లోవాళ్ళకి విదేశాలకు వెళ్ళటానికి లక్షలతో టికెట్లు కొని , తర్వాత వాటిని క్యాన్సిలేషన్ రిక్వెస్ట్ పెట్టడం ద్వారా ఆ డబ్బును తమ ఖాతాల్లోకి వేసుకోవాలని చూశారు.దీన్ని మొదట్లోనే పసిగట్టిన ప్రభుత్వం, పాత నోట్లతో టికెట్లను బుక్ చేసుకున్న వారి టికెట్లను క్యాన్సిల్ చేయొద్దని ఆదేశాలు ఇచ్చింది. దీనితో కౌంటర్ల దగ్గర పాత రూ. 500, రూ. 1000తో టికెట్లను కొన్న వారికి టిక్కెట్లను క్యాన్సిల్ చేసే అవకాశం ఉండదని, వాళ్లకి డబ్బును తిరిగి ఇవ్వబోమని ఎయిర్ లైన్స్ సంస్థలు ప్రకటించాయి. మాములుగా కౌంటర్ల వద్ద రోజు రూ. 20 నుంచి రూ. 25 లక్షల స్పాట్ బుకింగ్ ద్వారా వచ్చేవి. కానీ,ఇపుడు రోజుకు రూ. 1 కోటికి పైగా టికెట్లు బుక్ అయ్యాయి.
  • కొన్ని పట్టణాల్లో కొందరు బంగారు వ్యాపారవేత్తలు పాత నోట్లకు 50 వేలకు తులం బంగారం అని అమ్ముతున్నారని వినికిడి. దీంతో చాల మంది నల్ల ధనవంతులు బంగారాన్ని కొని నల్ల  ధనాన్ని గోల్డ్ మనీ గా మార్చేస్తున్నారు. 
  • అంతే కాకుండా పేదవాళ్ల బ్యాంకు అకౌంట్లను నల్ల బాబులు కొనేస్తున్నారు. తన డబ్బుని వాళ్ళ అకౌంట్లలో వేసి కేవలం రూ.2000 లేదా రూ.3000లకు ఇస్తున్నారని సమాచారం .

ఇపుడున్న సమాచారం ప్రకారం 25 లక్షల బ్లాక్ మనీ ని సులువుగా వైట్ గా మార్చొచ్చు అని నిపుణులు చెపుతున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here