బోడుప్పల్ నగర వాసిపై టిఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ భర్త దౌర్జన్యాన్ని ఖండించిన మూడెత్తుల మల్లేష్ యాదవ్

బోడుప్పల్ ద్వారకా నగర్ కాలనీ నివాసి అయిన పురేందర్ రెడ్డిని 27వ డివిజన్ టిఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ భర్త అతి దారుణంగా కొట్టిన ఈ అమానుషమైన సంఘటనను ఖండించడానికి భాజపా ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్, భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షులు కొంపల్లి మోహన్ రెడ్డి, భాజపా కార్పొరేటర్లు సామల పవన్ రెడ్డి, కుంభం కిరణ్ కుమార్ రెడ్డి భాజపా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నాయకులు మూడెత్తుల మల్లేష్ యాదవ్ మరియు దాసరి మహేష్ యాదవ్ తో ద్వారకా నగర్ బోడుప్పల్ నివాసి బాధితుడి నివాసానికి వెళ్లి పరమార్శించడం జరిగింది. మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఒక గుండాల పాలనలా, ఒక నియంత పాలనలా చేస్తున్నారని, కరోనా నియంత్రణలో చాలా ఘోరంగా ఓడిపోయారని, టిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ఒక గుండాల మాదిరిగా వ్యవహరించడం అతి దారుణం అని, భాజపా ఎంపిని, నాయకులను హింసించడం, బెదిరించడం, ముందస్తు అరెస్టులు చేయించడం లాంటి అప్రజాస్వామిక పనులు రాజకార్ల నవాబు పాలనను గుర్తుకు తెస్తుందని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్ర కమల దళపతి, ఎంపి బండి సంజయ్ కుమార్ బాధితుడితో మల్లేష్ యాదవ్ ఫోన్లో మాట్లాడించడం, బాగోగులు తెలుసుకొని, న్యాయం తప్పక జరిగేటట్టు చూస్తానని బండి సంజయ్ అన్న మాట ఇవ్వడం జరిగిందని అలాగే ఈ సంధర్భంగా ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ మల్లేష్ యాదవ్ మీడియా ఛానెల్ వారికి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగిందని ఎబివిపి సాంకేతిక సెల్ కన్వీనర్ రాకేష్ యాదవ్ తెలియచేశారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close