ప్రజా సమస్యలను ప్రశ్నించడంలో – ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో సోషల్ మీడియా కీలకమని బీజేపీ రాష్ట్ర ఐటీ & సోషల్ మీడియా కన్వీనర్ వెంకట్ రమణ అన్నారు. ఈరోజు బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా కార్యాలయంలో బీజేపీ జిల్లా ఐటీ & సోషల్ మీడియా కన్వీనర్ శ్రీ అఖిల్ వర్మ అధ్వర్యంలో జిల్లా ఐటీ & సోషల్ మీడియా కన్వీనర్ల సమావేశం జరిగింది. ఈయొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన వెంకట్ రమణ గారు మాట్లాడుతు రానున్న గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలో, ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రజలకు చేరువ కావడానికి సోషల్ మీడియా కీలకం అవ్తుంది అని, ప్రతి ఒక్కరూ కూడా దానిని ఉపయోగించుకొని బీజేపీనీ గెలుపుకు బావుట వేయాలని పిలుపునిచ్చారు.
ఈ యొక్క సమావేశంలో బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బాకం హరి శంకర్, ఐటీ & సోషల్ మీడియా సెల్ రాష్ట్ర జాయింట్ కన్వినర్లు ప్రకాష్ బాబు, సందీప్ మిశ్రా, కోర్ టీమ్ సభ్యులు సాగర్, ప్రదీప్ రావు, నిశాంత్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కందగట్ల సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.