తెలుగు రాష్ట్రాల ఎన్నికలతో ప్రయోగలు చేస్తున్న బీజేపీ?

61 0

తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు బీజేపీ మూడో స్థానంలో కొన్ని దశబ్దాలుగా ఉంటూ వస్తుంది.అపుడపుడు అతిథి పాత్ర వహిస్తూ అక్కడక్కడ ఎన్నికల్లో గెలవడం,తెదేపా పొత్తు వల్ల సీట్లు గెలుచుకున్న కూడా క్యాడర్ నిర్మాణం చేసుకోలేకపోయింది.కాని ఎప్పుడైతే మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్యంగా 4 సీట్లు గెలవడం,తరువాత నిజామాబాద్ కార్పొరేషన్ లో జెండా ఎగిరవేయటం,తర్వాత దుబ్బాక, గ్రేటర్ లో విజయ బావుటా ఎగురవేయటం పార్టీ ఆశలు చిగురించాయి.మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొన్ని తప్పిదాల వల్ల కొంచెం ఫలితాలు మిశ్రమంగా వచ్చినా కూడా భవిష్యత్తు మీద ఆశలు సజీవంగా ఉన్నాయని చెప్పొచ్చు.ఇదిలా ఉంటె రెండు తెలుగు రాష్ట్రాల్లో భాజపా భవిష్యత్తు కు ఎన్నికలను ప్రయోగశాలగా మార్చుతున్నట్లు కనబడుతుంది.ఇపుడు తిరుపతిలో జరుగుతున్న పార్లమెంట్,నాగార్జున సాగర్ లో అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థులను చూస్తే ఈ వ్యూహం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.ఏ స్థానంలో ఏ సామాజిక వర్గం ఎక్కువ ఉంటుందో వారికి టికెట్లు ఇవ్వాలనే వ్యూహంతో వెళుతూ భవిష్యత్తులో వోట్ బ్యాంక్ తయారుచేసుకునే దిశగా వెళుతున్నట్లు కనిపిస్తుంది.ఈ వ్యూహంతో ఇపుడు గెలిచినా గెలవకపోయినా కూడా అధికారం అందని వర్గాలకు అధికారాన్ని కట్టబెట్టే దిశగా వారి వ్యూహాలు ఉన్నాయి.

విషయానికొస్తే సామాజిక పరంగా నాగార్జున సాగర్ లో యాదవులు ఎక్కువగా ఉంటారు,తరువాత వారితో సమానంగా ఎస్టీలు ఉంటారు.యాదవ్ సామాజిక వర్గానికి చెందిన నోముల మరణంతో వచ్చిన ఎన్నికలు కావటం వల్ల ఆయన కుమారుడికి టిక్కెట్ ఇస్తే,కాంగ్రెస్ అందరు అనుకున్న విదంగానే జానారెడ్డి కి టికెట్ ఇచ్చింది.బీజేపీ మాత్రం గత ఎన్నికల్లో పోటీ చేసిన కంకణాల నివేదిత కాకుండా ఎవరూ ఊహించని విదంగా ప్రముఖ వైద్యుడు రవి నాయక్ కి టికెట్ ఇవ్వడం జరిగింది.చివరి వరకు నివేదిత కు దక్కుతుందని అనుకున్నారు కాని ఈ ప్రాంతంలో ఉన్న 20 వేల రెడ్ల ఓట్లు జానారెడ్డి గారికే పొలరైజ్ అయ్యే అవకాశం ఉండటంతో నివేదిత కు ఇస్తే ఈ ప్రాంతంలో ఉన్న బీసీలు, ఎస్టీల ఓట్లు బీజేపీ కి పడే అవకాశాలు ఉండకపోవటంతో ఒక జనరల్ స్థానంలో ట్రైబల్ వర్గానికి ఇవ్వడంతో ఒక ప్రయోగానికి తెరలేపింది.ఈ వ్యూహంతో భాజపా బాగా కష్టపడితే గెలిచే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది.ఒకవేళ ఓడిపోయిన కూడా రాష్ట్రంలో ఉన్న గిరిజనుల మనస్సు ను దోచుకున్న వారు అవుతారు.ఒకవేళ ఇదే వ్యూహాన్ని రాబోయే ఎన్నికల్లో పాటిస్తే భాజపా కు కలిసొచ్చే అంశం.

ఇక తిరుపతి విషయానికొస్తే రత్నప్రభా గారిని ఎంపిక కూడా చర్చకు దారిస్తుంది.గతంలో కర్ణాటక రాష్ట్ర ముఖ్య కార్యదర్శిగా పనిచేసి,రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన ఈమెను ఎంపిక భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తుంది.ఎందుకంటే ఇక్కడ మిగతా అభ్యర్థులు మాల సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కావటం,ఇమే మాత్రం మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారు కావటం,పైగా హిందువు అవ్వడం ప్రత్యేక అంశం.ఏపీలో మాలలు వైస్సార్సీపీ వైపు ఉండటం వల్ల ఆ వర్గపు ఓట్లు బాజాపకు పడే అవకాశాలు తక్కువ.ఇమే ఎంపిక వర్గీకరణ కోసం గత ఏళ్లుగా మాదిగలు చేస్తున్న పోరాటాలను దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో వర్గీకరణ దిశగా భాజపా అడుగులు ఉంటాయని రెండు రాష్ట్రాల్లో సంకేతాలు ఇచ్చినట్లు అయింది.వాస్తవానికి తిరుపతిలో మాల సామాజిక వర్గానికి కన్నా మాదిగ వర్గం ఓట్లు తక్కువ.దీంతో వారి జనాభా లేని దగ్గర అభ్యర్థిని పెట్టడం భాజపా తెరదించిన ఒక ప్రయోగం గా చెప్పుకోవచ్చు.

Related Post

కోవిడ్ భారిన పడ్డ ప్రముఖ జర్నలిస్ట్ దుర్గం రవీందర్ కి బాసటగా నిలుస్తున్న సామాజికవేత్తలు

కరోన మహమ్మరి అందరి బతుకులను చిదిమేయటానికి ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఆ ప్రణాళికలు అమలు చేస్తోంది.చిన్న పెద్ద తేడా లేకుండా ప్రపంచంలో మొట్టమొదటి సారి సామాజిక న్యాయం…

లక్కోర లో అంతర్జాతీయ మహిళ దినోత్సవ సందర్భంగా సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ ఆధ్వర్యంలో మహిళా రైతులకు సన్మానం

అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల లక్కోర లోమహిళా రైతులు పాడిద లక్మి,మీసాల మాధవి గార్లకీ సేవ్…

లక్కోర లో ఆదర్శ మహిళా రైతుకు సన్మానం

అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలో మహిళా రైతు మీసాల మాధవి గారికి సేవ్ గ్లోబల్…

మినిస్టర్ క్వార్టర్స్ లో రాష్ట్ర హోమ్ మంత్రి చేతుల మీద తెలంగాణ కబుర్లు క్యాలెండర్ ఆవిష్కరణ

తెలంగాణ హోమ్ మంత్రి మహుముద్ అలీ చేతుల మీదుగా తెలంగాణ కబుర్లు క్యాలెండర్ ఆవిష్కరణ మినిస్టర్ క్వార్టర్స్ లో జరిగింది.ఈ కార్యక్రమంలో తెరాస సీనియర్ నాయకులు శ్రీనివాస్…

బషీరాబాద్ లో స్వామి వివేకానంద జయంతి సందర్బంగా తెలంగాణ కబుర్లు క్యాలెండర్ ని విడుదల చేసిన సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ టీమ్

  ఈ రోజు స్వామి వివేకానంద గారి జయంతి సందర్బంగా జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా బషీరాబాద్ గ్రామంలో తెలంగాణ కబుర్లు వెబ్ ఛానెల్…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *